కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరండి | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరండి

Published Wed, Jan 3 2024 2:39 AM

Kishan Reddy Challenge to CM Revanth Reddy: Kaleshwaram Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రా యాలని, 48 గంటల్లో తాను కేంద్రం నుంచి అను మతి తెస్తానని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధి చాటుకోవాలని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య దోస్తీ లేదని నిరూపించుకోవాలని అన్నారు.

న్యాయ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తుతో ఫలితాలు వేగంగా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. విపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కేవలం న్యాయవిచారణ జరిపిస్తామనడం అనేక అనుమానాలకు తావిస్తోందని మంగళవారం మీడి యాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. 

ఎందుకు తాత్సారం? 
బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అతిపెద్ద అవినీతి స్కాం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని, ఎందుకు తాత్సారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం విషయంలో కేంద్రంతో పాటు ప్రధాని మోదీపై, తనపై కాంగ్రెస్‌ నేతలు ఇష్టం వచి్చనట్టుగా విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించే ఉద్దేశం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉందా? లేదా? స్పష్టం చేయాలన్నారు.  

అవగాహన నేపథ్యంలో సానుభూతి 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ పరిస్థితి బొటాబోటీ మెజారిటీతో తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉండడంతో ప్రస్తుత సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ల మధ్య ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహన ఏర్పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అవినీతిపై కాంగ్రెస్‌కు సాను భూతి ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తామిద్దరం చే సేది దోపిడీయేనని, తమ డీఎన్‌ఏ ఒకటేననే అభి ప్రాయంతో కాంగ్రెస్‌ ఉందని వ్యాఖ్యానించారు. మే డిగడ్డ సందర్శన సందర్భంగా రాష్ట్ర మంత్రులు పవ ర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లకే పరిమితమయ్యారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని, దీని కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  

17 ఎంపీ స్థానాలకు పోటీ
ఫిబ్రవరి 28న లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశాలున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలోని 17  స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని, జనసేనతో పొత్తు ఉండకపోవచ్చునని అన్నా రు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు విషయమై చర్చ జరగలేదని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి కేంద్రం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుందని, ఆ లోగానే కేంద్రం అఫిడవిట్‌ను సమర్పిస్తుందని చెప్పారు.

Advertisement
Advertisement