breaking news
-
కవిత కామెంట్స్‌పై సీఎం రేవంత్ రియాక్షన్
సాక్షి,మహబూబ్‌నగర్: మాజీ మంత్రి హరీష్‌రావు,సంతోష్‌రావు వెనక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలు,బీఆర్ఎస్ గురించి మాట్లాడారు.కాలగర్భంలో బీఆర్ఎస్ కలిసిపోతుంది. జనతా పార్టీకి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది. అవినీతి సొమ్ము పంపకంలో తేడాతోనే కొట్టుకుంటున్నారు. మీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఫోన్ ట్యాపింగ్.. మరో బాంబ్ పేల్చిన కవిత
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని అన్నారామె. బుధవారం జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరం చిట్‌చాట్‌లోనూ సంచలన ఆరోపణలకు దిగారు.ఫామ్‌హజ్ విషయాలన్నీ కాంగ్రెస్‌కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావులే(ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు) ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్‌కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారామె. ఈ గ్యాంగ్ గురించి కేసీఆర్‌కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్ఎస్లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని అన్నారామె. అలాగే.. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్లో ఆ ఇద్దరూ మేకవన్నె పులులు! -
గులాబీ బాస్.. రిలాక్స్!
సాక్షి, హైదరాబాద్: తన తండ్రిపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉండొచ్చని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఒకవైపు కవిత ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ఆరోపణలు, కీలక చేసిన వేళ.. ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం రిలాక్స్‌గా గడిపారు. సెప్టెంబర్ 1వ తేదీన కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమని ఆరోపించడం కలకలం రేపింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సీనియర్లకు, పార్టీ కేడర్‌కు కోపం తెప్పించింది. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో ఎడతెరిపి లేకుండా బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. బుధవారం ఉదయం నుంచి కూడా భేటీ జరుగుతుండగా.. కవిత ప్రెస్‌మీట్ సమయంలో మధ్యలోనే ఆయన బయటకు వెళ్లారు. కారులోనే వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరిగి పొలాలను చూసొచ్చారు. తిరిగి ఫామ్‌హౌజ్‌కు వచ్చి నేతలతో భేటీ కొనసాగించారు. -
ఆ ఒక్కటే బాధిస్తోంది: కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారాలు చేశారని, ఎంతో బాధ ఉంటేనే తాను ఇలా మాట్లాడుతున్నానని బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కుటుంబ వ్యవహారంపైనా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.భవిష్యత్తు గురించి కాదు.. నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నా. విచారణ లేకుండా, వివరణ తీసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. కోట్ల మందిలో ఒక్కరు కేసీఆర్. అలాంటి వ్యక్తి నాకు తండ్రి కావడం నా అదృష్టం. ఆయన చిటికెన వేలు పట్టుకునే ఉద్యమంలో నడిచా. అలాంటి వ్యక్తిపై నాకెందుకు కోపం?. పార్టీ జాగ్రత్త అనే రామన్నకు ఇప్పుడు కూడా చెబుతున్నా. నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏమైంది, ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా. నాకైతే అనుమానమే? అని కవిత అన్నారు.ఎంత పెద్ద నేతలైనా కొంత ఒత్తిడి ఉంటుంది. కేసీఆర్‌పైనా ఇప్పుడు అలాంటి ఒత్తిడే ఉండి ఉంటుంది. ఆడబిడ్డలు చెడు కోరుకోరు. కానీ, ఎంత బాధ కలిగి ఉంటే నేను ఇలా మాట్లాడుతా. కుటుంబంలో ఎన్నో అవమానాలు జరిగాయి. కానీ, అవన్నీ చెప్పుకోలేను. అందుకే పార్టీ పరంగా ఉన్న సమస్యల గురించే మాట్లాడా. నిజాయితీని నిరూపించేందుకు రాజీనామా చేశా. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నందుకు బాధగా లేదు. రాజకీయంగా పొరపచ్చాలు ఇవాళ ఉంటాయి.. రేపు తొలగిపోతాయి. కానీ, మా అమ్మకు దూరంగా ఉండాల్సి రావడమే నన్ను బాధిస్తోంది అని అన్నారామె. ఈ క్రమంలో.. కుటుంబ కలహాలను ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, పోస్టుల గురించి ఆమె స్పందించారు. ఎవరెవరితోనో నన్ను పోలుస్తూ కొందరు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. పనీపాటా లేని వాళ్లే అలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్లు చేసేవాటికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారామె. -
కవిత వ్యాఖ్యలు, ఆరోపణలపై స్పందిస్తున్న నేతలు
తెలంగాణలో కవిత వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత రాజీనామా రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, సంతోష్ రావుపై ఆరోపణలు పలువురు నేతలపై వ్యాఖ్యలు చేయడంతో అధికార కాంగ్రెస్, పలువురు నేతలు స్పందిస్తున్నారు.బండి సంజయ్ కామెంట్స్..కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగింది.కేసీఆర్ కుమార్తెనే చెప్పింది.భూమ్మీద జరిగిన అతి పెద్ద అవినీతి కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్.సీబీఐకి రెండేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి.కోర్టులో వాదించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేయిల్ అయిపోయింది.కేంద్రానికి ఈరోజు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ లేఖ రాసి చేతులు దులుపుకునే యత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.ఫోన్ ట్యాపింగ్‌లో జడ్జీ నుంచి కేంద్ర మంత్రుల వరకూ ట్యాపింగ్ చేస్తే దాన్ని ఎందుకు మరి సీబీఐకి ఇవ్వలేదో చెప్పాలి.ఒక డెయిలీ సీరియల్లా నడిపిస్తున్నారు.విద్యుత్ కొనుగోళ్ల స్కాం విషయంలో రిపోర్ట్ ఏమైందో తెలియదు.కేసీఆర్ బిడ్డ అయితే ఏంది?బీఆర్ఎస్ అవినీతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కవిత ఇష్యూను తెరపైకి తెస్తున్నారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్..తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా ఐదుగురు కలసి దోచుకున్నారు.అందులో కవిత కూడా ఉంది.కవిత బయటకు వచ్చి అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా.సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది.హరీష్ రావు, ఈటెల రాజేందర్, సంతోష్ రావు అవినీతి చేస్తుంటే చూస్తూ కూర్చున్న కేసీఆర్ కూడా అవినీతి పరుడే.దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో పంచాయతీతోనే కవిత బయటకు వచ్చిందికాళేశ్వరం విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.కవిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కవిత రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు..ఒక ప్రతిపక్ష పార్టీ నేతతో సీఎం ఒప్పందం చేసుకుంటారా?.మీ నిస్సహాయతను మాపై చూపెట్టడం ఏంటి?ఇంటి పంచాయితీని కాంగ్రెస్ రుద్దుతున్నారు.హరీష్ రావుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది..కాళేశ్వరంలో హరీష్ రావు పేరు కూడా ఉంది..బీఆర్ఎస్ పార్టీ మాకు ఎప్పుడు ప్రత్యర్థే.కవితను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడమా?.అది కలలో కూడా జరగదు. -
రామన్నా.. కేసీఆర్, పార్టీని కాపాడండి: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ కుమార్తె కవిత రాజీనామా చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్‌రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో వారి నుంచి పార్టీని కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడాలని ఆవేదనతో చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా కుటుంబాన్ని విచ్చిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కొందరు ఎదరుచూస్తున్నారు. నాపై కుట్రలు జరిగాయి. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు.బంగారు తెలంగాణ అవుతుందా?కేసీఆర్‌పై నాకెందుకు కోపం. నా తల్లితో నేను మాట్లాడలేకపోతున్నాను. అదే నా బాధ. తల్లితో మాట్లాడకుంటే ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. చెప్పింది చెప్పినట్లు ఆయన చేశారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ భారత రాష్ట్ర సమితి అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా?.నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. నాన్న.. ఇప్పటికైనా మేలుకోండి. నాన్న, రామన్నా.. జాగ్రత్తగా ఉండండి. పార్టీని కాపాడండి’ అని వ్యాఖ్యలు చేశారు. చివరగా.. జై కేసీఆర్, జై తెలంగాణ అని నినాదం ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని వర్గాలతో మాట్లాడి, భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. -
ఆ ఆరడుగుల బుల్లెట్టే నాకు గాయం చేసింది: కవిత
వ్యక్తిగత లబ్ది కోరుకునే కొందరు పార్టీ నుంచి తనను బయటపడేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బుధవారం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదు. ప్రతీ సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్‌కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. ఆయన బీజేపీతోనూ టచ్‌లో ఉన్నారు. హరీషన్నపై మొదటిరోజు మీడియాలో ఆరోపణలు వస్తాయి. రెండో రోజు నుంచి హరీష్‌రావు పేరు కనిపించదు. రేవంత్ రెడ్డి గురించి కూడా ఏనాడూ హరీష్‌రావు గురించి మాట్లాడలేదు. మ్యాచ్‌ఫిక్సింగ్ జరగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?. రేవంత్రెెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.హరీష్‌రావు మొదటి నుంచి బీఆర్ఎస్ లేరు. పార్టీ మనకెందుకు మామా అని కేసీఆర్‌కు చెప్పి.. వ్యాపారం చేసే ఆలోచన కూడా చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 8, 9 నెలలకే చేరారు. పార్టీకి వెన్నుపోటు పొడుదాం అని గతంలోనూ ఆయన అనుకున్నారు. కేటీఆర్‌ను బతిమాలి పార్టీలో కొనసాగారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ మేకర్. ఆయనే సమస్య సృష్టించి.. ఆయనే మాఫీ చేసినట్లు నటిస్తారు. ఎలాగైనా కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చుపెట్టి పార్టీని సొంతం చేసుకోవాలనే కుట్రలు చేస్తున్నారు. హరీష్‌రావును నమ్ముకుని మైనంపల్లి, ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు.. ఇలా ఎందరో పార్టీని వీడారు. 2018 ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి డబ్బులనే 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండ్‌గా పంచారు. ఆయన ఫండింగ్ వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను(కేటీఆర్‌ను ఉద్దేశించి.) ఓడించడానికి హరీష్ కుట్ర చేశారు. సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అర్ధరాత్రి దాకా చర్చ జరిగింది. ‘‘ఓ హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ పొగడ్తలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ ఆరడుగుల బుల్లెట్టు నాకు గాయం చేసింది. తర్వాత మీ వంతే. రామన్న.. మళ్లీ రేపు మీపై కూడా కుట్ర జరగొచ్చు’’ అని అన్నారామె. సంతోష్‌రావు అనే వ్యక్తి చెప్పులో రాయి.. చెవిలో జోరీగా టైప్ అని అభివర్ణించారు. సంతోష్‌కు ధనదాహం చాలా ఎక్కువ. హరిత హరం పేరిట సినిమా హీరోలతో ఫోజులిప్పించి.. అడవులను కొట్టేయాలని చూశారు. రామన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక మాఫియా దళితులను చిత్రహింసలు పెట్టింది. చేయించింది అంతా సంతోష్‌రావు.. పేరు మాత్రం కేటీఆర్‌కు. పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నారు?. సంతోష్‌రావు క్లాస్మేట్ కావడమే అందుకు కారణం. సంతోష్‌రావు వల్లే మాకు సంబంధించిన టీవీ, పేపర్లలోనూ నన్ను చూపించడం లేదు. సంతోష్, హరీష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. హరీషన్న, సంతోషన్నలు మేకవన్నె పులులు. వాళ్లను పక్కనపెడితే పార్టీ బతుకుతుంది’’ అని కవిత అన్నారు. -
కేటీఆర్ సహా పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజా రాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కవిత మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నార అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. -
బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం హైలైట్స్.. 👉పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. 👉అక్రమ కేసుల్లో నేను జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను తప్ప.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా సస్పెన్షన్ వార్తలను మీడియాలో చూశాను. సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీ వ్యతిరేకమా?. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. కోట్లలో ఒక్కరు కేసీఆర్.. 👉కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నాను. పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేశారు. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. కేసీఆర్ లాంటి తండ్రి కోట్లలో ఒక్కరు ఉంటారు. అలాంటి వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నారు. అది నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా నా తల్లితో కూడా నేను మాట్లాడటం లేదు. ఆమెను కలవలేకపోతున్నారు. ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదు. ఇద్దరు వ్యక్తులు నా కుటుంబాన్ని విచ్చినం చేశారు. నాశనం చేయాలని చూశారు. విధి అనేది ఒక్కటి ఉంది. కచ్చితంగా వారికి కాలమే సమాధానం చెబుతుంది. తప్పకుండా అనుభవిస్తారు. రేవంత్‌తో కలిసి హరీష్ కుట్రలు.. 👉నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. హరీష్ రావు, సంతోష్‌రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అయితదా?. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్‌కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. రేపటి రోజు రామన్నకు ప్రమాదమే.. 👉రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రేవంత్, హరీష్ కుమ్మకై నాపై కుట్రలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చినప్పుడు మంత్రి హరీష్‌రావే కదా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లకు హరీష్ డెయిరీ నుంచి పాల పంపిణీ జరిగింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?. నన్ను సస్పెండ్ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. హరీష్ వల్లే ఓటములు.. 👉హరీష్ ట్రబుట్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. ట్రబుట్ క్రియెట్ చేసి దీన్ని సాల్వ్ చేసినట్టు చెప్పుకుంటారు. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ సూపర్. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి డే-1 నుంచి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్‌రావు వద్దన్నారు. తొమ్మిది, పది నెలల తర్వాత వచ్చారు. హరీష్ రావు నక్క జిత్తులను గమనించండి. నిజామాబాద్‌లో నా ఓటమిలో కూడా కుట్రలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను కూడా ఓడించే ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్ రావు హస్తం కూడా ఉంది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపునకు కూడా హరీషే కారణం. హరీష్ వల్లే రఘునందన్ రావు, ఇతర కీలక నేతలు బయటకు వచ్చారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటివి చాలానే జరిగాయి. జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీ వీడింది హరీష్ రావు వల్లే. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నాకు గాయం చేసింది. తర్వాత మీకు గాయం చేస్తుంది. గ్రీన్ ఇండియా పేరుతో సంతోష్ రావు ఓవరాక్షన్.. 👉హరితహారం కేసీఆర్ పెడితే.. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో నకిలీ కార్యక్రమం చేపట్టాడు. సంతోష్ రావు కూరలో ఉప్పు లాంటి వాడు. చిరంజీవి, ప్రభాస్ లాంటి సినీ నటులను మోసం చేసిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఫార్టెస్ట్ను కొట్టేద్దామనుకున్నారు. సిరిసిల్లలో ఏడుగురు దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టడానికి సంతోష్ రావు బాధ్యుడు. ఆయన కారణంగా కేటీఆర్, పార్టీకి నష్టం కలిగింది. సంతోష్ రావుతోనూ రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీకి నేనేమీ చేయలేదా?. పార్టీలో నా కాంట్రిబ్యూషన్ లేదా?. హరీష్, సంతోష్లదే ఉందా?. వాళ్లు మేకవన్నె పులులు నాన్న. కలికాలం కాబట్టి వాళ్ల టైమ్ నడుస్తోంది. బీఆర్ఎస్ హార్డ్ వేర్ అయితే.. జాగృతి సాఫ్ట్వేర్ అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరను.. 👉చివరగా.. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలో గానీ చేరడం లేదన్నారు. తన భవిష్యత్ గురించి జాగృతి నేతలు, బీసీ నాయకులు, అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. -
కవిత సస్పెన్షన్.. కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు.. బీఆర్ఎస్ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. కవిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్..ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్! మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ, సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం నేపథ్యంలో కవిత చేసిన ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి వరకు ఎర్రవల్లి నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. పార్టీ ప్రయోజనాలు, కేడర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కవితపై సస్పెన్షన్ వేటుకు ఆదేశించినట్లు సమాచారం. ఇకపై కవిత చేసే ఆరోపణలు, విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని ఏకతాటిపై నడిపించడంపై దృష్టి కేంద్రీకరించాలని కేటీఆర్‌ను ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రజల సొత్తు అంటున్న నేతలు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలు స్వాగతించారు. కేసీఆర్ ఎవరి సొత్తూ కాదని, కవితతో పాటు పార్టీ కేడర్‌కు ఆయన తండ్రి లాంటి వాడని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. పార్టీ కోసం కన్నబిడ్డను కూడా వదులుకున్న నేత కేసీఆర్ అంటూ పలువురు నాయకులు కొనియాడారు. కేసీఆర్ ప్రతిష్టపైనే బీఆర్ఎస్ మనుగడ, 60 లక్షల మంది కేడర్ భవిష్యత్తు ఆధారపడి ఉందనే విషయాన్ని కవిత మరిచిపోయి విమర్శలు చేశారంటూ పలువురు నేతలు ప్రకటనలు విడుదల చేశారు. కేసీఆర్ ప్రతిష్టను మసకబార్చేలా ఆమెను ఎవరో మానసిక ఒత్తిడికి గురి చేసి ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కవిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కేసీఆర్‌కు, పార్టీకి బాధ కలిగించే అంశమైనప్పటికీ సస్పెన్షన్ తప్పనిసరి అని పార్టీ అధినేత భావించారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీ: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కవిత సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం.. ఆ అవినీతి సొమ్ము పంపకంలో తేడాలు వచ్చాయి. అందుకే ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై కవిత మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే విషయం బీజేపీ చెబితే రాజకీయం అంటారు’’ అని రామచందర్‌రావు పేర్కొన్నారు.అవినీతి డైవర్షన్.. కవిత సస్పెన్షన్: డీకే అరుణకవిత సస్పెన్షన్‌ను కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీగా ఎంపీ డీకే అరుణ అభివర్ణించారు. ఆ కుటుంబంలో అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కవిత ఏకంగా జైలుకే వెళ్లి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి డైవర్షన్‌లో భాగంగానే కవిత సస్పెన్షన్. బీఆర్స్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి’’ అంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు.కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు: హరీష్బాబుబీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ.. కవితపై వేటు పూర్తిగా కుటుంబ వ్యవహారమన్నారు. ‘‘కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడుతున్నాయి. కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. కాళేశ్వరం అవినీతిలో ఇద్దరి పాత్ర ఉందని కవిత చెప్పారు. సీబీఐకి కవిత పూర్తి వివరాలు అందించాలి’’ అని హరీష్‌బాబు పేర్కొన్నారు. -
అక్కకు అడ్డొస్తే.. కవిత అనుచరుల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ‘‘వాడెవ్వడు వీడెవ్వడు కవిత అక్కకు అడ్డు ఎవడు’’ అంటూ జాగృతి కార్యాలయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జాగృతి అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ హరీష్‌రావు అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అక్కకు అడ్డొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన ఆమె అనుచరులు.. సస్పెండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.‘‘కవిత సస్పెన్షన్‌తో జరిగేది ఏమీలేదు. కేసీఆర్‌పై సీబీఐ విచారణను కవిత తట్టుకోలేకపోయారు. చాలా రోజులుగా కవితను దూరంపెట్టే యోచన జరుగుతోంది’’ అంటూ బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమన్న జాగృతి కార్యకర్తలు.. కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదని మండిపడ్డారు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం’’ అంటూ జాగృతి కార్యకర్తలు మండిపడ్డారు. -
షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్!
గీత దాటితే బహిష్కరణలే తప్ప మరొకటి ఉండని పార్టీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సంచలన అభియోగం మీద గులాబీ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. గతంలో పార్టీ తీసుకున్న చర్యల దృష్ట్యా కవిత బహిష్కరణ తప్పదంటూ ఈ ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అలాంటప్పుడు సస్పెన్షన్ వేటుతోనే ఎందుకు సరిపెట్టాల్సి వచ్చింది?.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా సరే క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. విచారణలు, నోటీసులు, షోకాజ్ల్లాంటివేం లేకుండా నేరుగా కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సాగనంపుతూ వచ్చింది. గతంలో.. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపైనా బహిష్కరణ వేటే వేసింది. 2021లో ఈటల రాజేందర్పైనా నేరుగా బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. అలాంటిది గత 12 ఏళ్లుగా పార్టీలో మూలనపడిన క్రమశిక్షణ కమిటీని తెర మీదకు తెచ్చి మరీ.. కవితను సస్పెండ్ చేయడం ఆశ్యర్యానికి కలిగిస్తోంది. కిందటి ఏడాది ఆగస్టులో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చాక కవిత కొంతకాలం పాటు వ్యక్తిగత జీవితం మీదే ఫోకస్ చేశారు. అయితే.. ఈ ఏడాదిలో క్రియాశీలకంగా మారిన ఆమె 2.0 రాజకీయంతో సొంత పార్టీకే వరుస షాకులు ఇస్తూ వచ్చారు.షాక్ నెంబర్ 1..పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలతో బహిరంగ లేఖ రాయడం మే నెలలో కలకలం రేపింది. రజతోత్సవ సభ(బీఆర్ఎస్ సస్లివర జూబ్లీ వేడుకలో)లో సాగిన అధినేత ప్రసంగంపై కేడర్ అసంతృప్తిగా ఉందంటూ.. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడేకానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన తండ్రికి రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారంటూ మండిపడ్డారామె.షాక్ నెంబర్ 2.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చించడం మంచిదికాదన్న సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి... కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని మే 29వ తేదీన జరిగిన మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. ఆపై రెండు రోజులుగా కొత్తగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. అంతేకాదు.. ఈ ఏడాది కేటీఆర్ చేతికి కవిత రాఖీ కూడా కట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.షాక్ నెంబర్ 3..కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు విచారణ నోటీసులు ఇవ్వడంపై నిరసనగా.. జూన్ 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారామె. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉంది. షాక్ నెంబర్ 4..జూన్ 16వ తేదీన.. ఫార్ములా ఈకార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరైతే.. అదేరోజు అదేంపట్టనట్లు జగిత్యాలలో ఆమె పర్యటించారు. షాక్ నెంబర్ 5..జులైలో.. జహీరాబాద్‌లో జరిగిన బీసీ రిజర్వేషన్ల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మండలి చైర్మన్‌కు ఆమె మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. అయితే ఇంత జరిగినా.. బీఆర్ఎస్ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. షాక్ నెంబర్ 6..బీఆర్ఎస్ కేడర్‌ను అయోమయానికి గురిచేసిన పరిణామం ఇది. జులై 26వ తేదీన ఉప్పల్‌లో కేటీఆర్ బీఆర్ఎస్వీ సభ, కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కవిత నిర్వహించారు. షాక్ నెంబర్ 7..పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధనాదీక్ష చేపట్టారు. జై బీసీ.. జై జాగృతి నినాదాలు చేశారుషాక్ నెంబర్ 7..ఆగష్టు 5వ తేదీన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ నేత వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. షాక్ నెంబర్ 8.. కాళేశ్వరంపై బాంబ్ పేల్చారామె. హరీష్‌రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీనా?అంటూ రగిలిపోయిన ఆమె.. ఇంతదాకా వచ్చినా పట్టనట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఈ వరుస షాకులిస్తున్నా.. తనపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె విమర్శలకు మరింత పదును పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను అధినేత కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కవితపై కఠిన చర్యలే ఉండాలని సీనియర్లు పలువురు కేసీఆర్ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జాగృతి సుదీర్ఘంగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతుండడం.. కవిత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కవితపై తీసుకోబోయే చర్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై తీవ్రంగా చర్చించారు. చివరాఖరికి సస్పెండ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. బీఆర్ఎస్లో 2025 ఏడాది కల్వకుంట్ల కవిత కల్లోలనామ సంవత్సరంగా మిగిలిపోనుంది. -
కవిత సస్పెన్షన్‌పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలో కవిత సస్పెన్షన్‌పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం.అందులో మేం తలదూర్చం.ఇది అంతా ఆస్తి పంపకాల్లో గొడవలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు కవిత అవసరం లేదు. ఎవరినీ మాపార్టీలో చేర్చుకోవాల్సి అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. -
కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: పల్లా
సాక్షి, హైదరాబాద్: పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న పల్లా.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ ఆదేశాలే మాకు శిరోధార్యం’’ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తేల్చి చెప్పారు.కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేపీ వివేకానందకేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ‘‘గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని గతంలోనే కేసీఆర్ చెప్పారు...కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్త్ ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ రోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని వివేకానంద పేర్కొన్నారు.కాగా, హరీష్‌రావు, సంతోష్‌రావులు అవినీతి అనకొండలన్న కవితపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ల్లొ కవిత ఫ్లెక్సీలను తొలగించారు. -
వేటుపై కవిత రియాక్షన్.. సర్వత్రా ఉత్కంఠ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ విధించడంతో ఎమ్మెల్సీ కవితపై భవిష్యత్ కార్యచరణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ రేపు (బుధవారం) మధ్యాహ్నం 12గంటలకు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నోట్‌ను విడుదల చేసింది. ఆ నోట్లో కవితపై వేటు గల కారణాల్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కేసీఆర్ ఆదేశాలతో కవిత సస్పెన్షన్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.కవిత ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలోఉన్నందున బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని, తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన కార్యదర్శి టీ రవీందర్రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ మెంబర్ సోమ భరత్‌కుమార్ పేరిట లేఖ విడుదలైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నుంచి కవితకు పార్టీకి మధ్య గ్యాప్ మొదలైంది. కేసీఆర్ ప్రసంగంపై ఆమె బహిరంగ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. అటుపై సోదరుడు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా ఆమె అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఇక.. లిల్లీపుట్ అంటూ మాజీమంత్రి జగదీష్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా.. హరీష్‌రావు, సంతోష్‌రావులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలే చేశారామె. పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె.… pic.twitter.com/iTSWON3irq— BRS Party (@BRSparty) September 2, 2025 -
షోకాజ్ నోటీసు ఇస్తారా? వేటు వేస్తారా?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కీలక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న చర్చల దృష్ట్యా కవితపై చర్చలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం నుంచి కీలక నేతలతో సమావేశం జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు యూకే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.నిన్న అర్ధరాత్రి ఫామ్‌హౌజ్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ ఈ ఉదయం మళ్లీ అక్కడకు చేరుకున్నారు. కేటీఆర్‌తో పాటు జగదీష్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. మొన్నీమధ్యే బహిరంగ లేఖ పేరిట కేటీఆర్ పైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కవితపై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే వ్యాఖ్యలకుగానూ షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా?.. చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ.. వేటు వేస్తే తలెత్తే పరిణామాలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఒకవేళ కవితపై వేటు పడితే.. జాగృతిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎటు వైపు ఉంటారు? అనే కోణంలోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం నివేదిక.. సీబీఐ విచారణకు ఆదేశం దరిమిలా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హరీష్‌రావుపై వ్యాఖ్యలకు నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్దం చేయడం గమనార్హం. -
ఆ ఇద్దరి వల్లే కేసీఆర్‌కు మరక: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత పక్కన ఉంటూ ఆయన పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొందిన వారు చేసిన చెత్త పనుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావుతో పాటు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేజర్ పాత్ర ఉన్నందునే ఐదేళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావును రెండోసారి ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరంగా పెట్టారన్నారు. అమెరికా పర్యటన నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇలాగైతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? ‘కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి, ఆయనపై ఆరోపణలు రావడానికి కారకులెవరో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ ప్రజల కోసం ఆలోచిస్తే.. వీళ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సొంత వనరులు, ఆస్తుల కోసం ఆలోచించారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తి కేసీఆర్ వైపు వేలెత్తి చూపి సీబీఐ విచారణ జరుపుతా అనేందుకు కారకులు ఎవరు? హరీశ్‌రావు, సంతోష్‌రావు నా మీద వ్యక్తిగతంగా అనేక కుట్రలు చేసినా ఇన్నాళ్లూ పేరు పెట్టి విమర్శించలేదు. కానీ ఇలాంటి వారిని మోస్తూ పోతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? బీఆర్ఎస్ నాయకులకు కోపం వచ్చినా చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదు..’అని కవిత అన్నారు. నన్ను విమర్శిస్తే ఖబడ్దార్! ‘హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉంటూ వాళ్లను అన్ని విషయాల్లో కాపాడుతూ కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్న అవినీతి అనకొండలను ఏమీ అనడం లేదు. అంతర్గతంగా వారి నడుమ ఉన్న అవగాహన బయటకు రావాలి. నన్ను.. బీజేపీ, కాంగ్రెస్, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని రేపటి నుంచి సోషల్ మీడియాలో విమర్శిస్తే ఖబడ్దార్. నేను ఎవరో చెప్తే ఆడే తోలు»ొమ్మను కాను. నాది కేసీఆర్ రక్తం. స్వతంత్రంగా నేను అనుకున్న విషయాలను చెప్తా. రాజకీయంగా నాకు జరిగే కష్టం, నష్టాన్ని భరించేందుకు సిద్ధం. మా నాన్నకు లేఖ రాసిన నాటి నుంచి నాకు నరకం చూపిస్తూ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు రాయిస్తున్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ అంటే కడుపు రగులుతోంది. అభివృద్ధి విషయంలో కేసీఆర్ నిజాం బాటలోనే నడుస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మా నాన్న పరువు పోతే నాకు బాధ. కానీ మీకు మాత్రం డబ్బులు కావాలి. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి. బీఆర్ఎస్ నాయకులు తిట్టుకున్నా, స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అనుకున్నా సరే. మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతారు.. మరోసారి గెలుస్తారు. ఇలాంటి దుర్మార్గుల వల్లే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బులు, టీవీలు, సోషల్ మీడియా ఉన్నాయని ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం. కేసీఆర్‌పై పీసీ ఘోష్ కమిషన్లు, సీబీఐ విచారణలు వేస్తే తెలంగాణ బంద్‌కు పార్టీ పిలుపునివ్వాలి కదా? కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సీబీఐ విచారణకు ఆదేశించారు. నేను చెప్పిన పేర్లు ఉన్న వారితో రేవంత్‌కు అవగాహన లేకపోతే వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ పేరు చెప్పుకోనిదే రేవంత్‌కు పూట గడవడం లేదు. వాస్తవానికి కేసీఆర్‌కు తెలంగాణ తప్ప.. తిండి, డబ్బు ధ్యాస ఉండదు. విచారణ నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.’అని కవిత పేర్కొన్నారు. -
హరీష్ రావుపై కేటీఆర్ పొగడ్తల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి హరీష్‌రావును కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని ప్రశంసలు కురిపించారు. . నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ’ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL— KTR (@KTRBRS) September 1, 2025 -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్!
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్‌రావు,సంతోష్‌రావుదేనంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సైతం హరీష్‌రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్‌గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. హరీష్‌రావు,సంతోష్‌రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్‌రావుపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వో నవీన్‌ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్వో నవీన్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్‌రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్వో నవీర్‌ను గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్‌ఫాలో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025 -
‘కవిత వ్యాఖ్యలతో అవినీతి జరిగిందనేది స్పష్టమైంది’
హైదరాబాద్: సీఎం కేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావులు కలిసి తన తండ్రి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కవిత చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఖండించారు. సీఎం రేవంత్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను సరికాదన్నారు. కుటుంబ గొడవల్ని తీసుకొచ్చి సీఎం రేవంత్‌పై రుద్దడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు మహేష్ గౌడ్. ‘ సీఎం రేవంత్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయింది. కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆర్ లేదా హరీష్ రావా అనేది మాకు అనవసరం. వారి హయాంలో స్కామ్ జరిగిందనేది కవిత వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. కాళేశ్వరంలో మామ కేసీఆర్ వాటా ఎంత..?, అల్లుడు హరీష్ రావు వాటా ఎంత? అనేది తేలాల్సి ఉంది. మీ కుటుంబ కలహాలను మాపై రుద్దడం ఏంటి?’ అని ప్రశ్నించారు. కేసిఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్‌కు సంబంధంలేదన్నారు మహేష్ గౌడ్. ఇదీ చదవండి:కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కవిత -
‘కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది?’
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావును టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. హరీష్‌పై కవిత సంచల వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన అద్దంకి దయాకర్.. ‘ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని స్పష్టమైంది. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది. మొన్న కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్‌ను టార్గెట్ చేయడం వెనుక ఏదో ఉంది. కేటీఆర్, హరీష్, కవితల మధ్య ఏదో పంచాయితీ ఉంది’ అంటూ అని పేర్కొన్నారు.కాగా, బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. -
‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మాజీ మంత్రి హరీష్‌రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్‌రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్‌గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అని కామెంట్స్ పెట్టింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe— BRS Party (@BRSparty) September 1, 2025 -
కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది.ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలాగే మాట్లాడతా. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్‌కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణం. హరీష్‌రావు,సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌పై అవినీతి మరక. ఇలాంటి వారిని ఎందుకు భరించాలి. కేసీఆర్‌కు అవినీతి మరక ఇలాంటివాళ్ల వల్లనే వచ్చింది. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు?.ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి?.కేసీఆర్‌పై విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత?.కేసీఆర్‌కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి?’.వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్‌రావు,సంతోష్‌రావులపై చర్యలు తీసుకోండి.ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద వందలకోట్లు దొరికాయి. ఆ అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదు. పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తా. కాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తిలేదు. పార్టీ ఓటమికి కారణం కేసీఆర్ వెంట ఉన్నవాళ్లే’ అని ఆవేశంతో మాట్లాడారు.