
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ సస్పెన్షన్ విధించడంతో ఎమ్మెల్సీ కవితపై భవిష్యత్ కార్యచరణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ రేపు (బుధవారం) మధ్యాహ్నం 12గంటలకు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని హైలెట్ చేస్తూ బీఆర్‌ఎస్ నోట్‌ను విడుదల చేసింది. ఆ నోట్‌లో కవితపై వేటు గల కారణాల్ని ప్రస్తావించింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.