
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్, ఆపై పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, భవిష్యత్ కార్యచరణపై పరోక్షంగా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అందులో .. ‘నిజం మాట్లాడటానికి చెల్లించాల్సిన మూల్యం ఇది అయితే.. తెలంగాణ ప్రజలకోసం వందరెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. అయితే ఈ హరీష్ రావు, సంతోష్‌రావు గురించి సంచలన ఆరోపణలు చేసిన తర్వాత పార్టీలోని పరిణామాల్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై బీఆర్‌ఎస్ హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది. హరీష్ రావు ఆరడగుల బుల్లెట్టు అంటూ వెనకేసుకొచ్చింది.
అదే సమయంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో పార్టీ ఎమ్మెల్సీ కే.కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు,కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ’బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన చేసింది.
ఈ క్రమంలో పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్ తనని సస్పెండ్ చేయడంతో..కవిత కొత్త పార్టీని పెట్టనున్నారని,బీఆర్‌ఎస్‌యేతర పార్టీలో చేరబోతున్నారనే ప్రచారానికి పులిస్టాప్ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయోద్దని సూచించారు. ఇలా వరుస పరిణాలతో కవిత బుధవారం ఎక్స్‌లో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది.
If this is the cost of speaking up the truth then I am ready to pay the cost hundred times again for the people of Telangana.
Satyameva Jayathe
Jai Telangana✊— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 3, 2025