
హైదరాబాద్: బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావును టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. హరీష్‌పై కవిత సంచల వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన అద్దంకి దయాకర్.. ‘ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని స్పష్టమైంది. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది. మొన్న కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్‌ను టార్గెట్ చేయడం వెనుక ఏదో ఉంది. కేటీఆర్, హరీష్, కవితల మధ్య ఏదో పంచాయితీ ఉంది’ అంటూ అని పేర్కొన్నారు.
కాగా, బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్‌ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..
‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్‌ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు.