
సాక్షి, హైదరాబాద్: ‘‘వాడెవ్వడు వీడెవ్వడు కవిత అక్కకు అడ్డు ఎవడు’’ అంటూ జాగృతి కార్యాలయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జాగృతి అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ హరీష్‌రావు అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అక్కకు అడ్డొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన ఆమె అనుచరులు.. సస్పెండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
‘‘కవిత సస్పెన్షన్‌తో జరిగేది ఏమీలేదు. కేసీఆర్‌పై సీబీఐ విచారణను కవిత తట్టుకోలేకపోయారు. చాలా రోజులుగా కవితను దూరంపెట్టే యోచన జరుగుతోంది’’ అంటూ బీఆర్‌ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమన్న జాగృతి కార్యకర్తలు.. కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదని మండిపడ్డారు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం’’ అంటూ జాగృతి కార్యకర్తలు మండిపడ్డారు.