
సాక్షి,మహబూబ్‌నగర్: మాజీ మంత్రి హరీష్‌రావు,సంతోష్‌రావు వెనక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలు,బీఆర్‌ఎస్ గురించి మాట్లాడారు.
కాలగర్భంలో బీఆర్‌ఎస్ కలిసిపోతుంది. జనతా పార్టీకి పట్టిన గతే బీఆర్‌ఎస్‌కు పడుతుంది. అవినీతి సొమ్ము పంపకంలో తేడాతోనే కొట్టుకుంటున్నారు. మీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
