
హైదరాబాద్: సీఎం కేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావులు కలిసి తన తండ్రి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కవిత చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఖండించారు. సీఎం రేవంత్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను సరికాదన్నారు. కుటుంబ గొడవల్ని తీసుకొచ్చి సీఎం రేవంత్‌పై రుద్దడం ఏంటని ప్రశ్నించారు.
ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు మహేష్ గౌడ్. ‘ సీఎం రేవంత్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయింది. కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆర్ లేదా హరీష్ రావా అనేది మాకు అనవసరం. వారి హయాంలో స్కామ్ జరిగిందనేది కవిత వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. కాళేశ్వరంలో మామ కేసీఆర్ వాటా ఎంత..?, అల్లుడు హరీష్ రావు వాటా ఎంత? అనేది తేలాల్సి ఉంది. మీ కుటుంబ కలహాలను మాపై రుద్దడం ఏంటి?’ అని ప్రశ్నించారు. కేసిఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్‌కు సంబంధంలేదన్నారు మహేష్ గౌడ్.
ఇదీ చదవండి: