breaking news
-
మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీవ్రంగా పరిగణిస్తోంది. నగరంలోని మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో దక్కించుకునేందుకు పకడ్బందీగా వ్యూహ రచన చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వాస్తవంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్‌లో గట్టెక్కడం క్లిష్టమైనా.. అధికార పక్షం కావడంతో ఉప ఎన్నికల కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న ధీమాతో జూబ్లీహిల్స్ సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నా.. అధిష్టానం సర్వే నిర్వహించి గెలుపు గుర్రాన్ని బరిలో దింపాలని యోచిస్తోంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా కొనసాగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి.. రాజధాని నగరంలో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం దక్కింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో మరో నియోజకవర్గం చేజిక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అయితే.. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గెలుపుపై మజ్లిస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వాస్తవంగా నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. మజ్లిస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈసారి కూడా బరిలో దిగితే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.జూబ్లీహిల్స్ సంపన్నులతో పాటు ముస్లింలు అత్యధికం ఉండే నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్ 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మారి 2018, 2023 వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 2014, 2018 వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించి క్రికెటర్ అజహరుద్దీన్‌ను బరిలో దింపడంతో విష్ణువర్ధన్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు మాత్రం ఓటమి తప్పలేదు.టికెట్ రేసులో ముగ్గురు నేతలు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ (Azharuddin) మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మైనారిటీ కోటా కింద మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లో పేరొందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈసారి బరిలో దిగేందుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో నవీన్ యాదవ్ (Naveen Yadav) కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దింపక పోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: జూలై రెండో వారంలో స్థానిక సంస్థల నగారా కార్మిక నేత దివంగత పీజేఆర్ (PJR) కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు. అక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో భవిష్యత్తులో సైతం ఖైరతాబాద్‌పై ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. దీంతో తన తండ్రి చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్‌పై విజయారెడ్డి దృష్టి సారించి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.పెరిగిన ఓటు బ్యాంక్‌పై ఆశలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఓటు బ్యాంక్ పెరగడంతో ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం అదే పునరావృత్తమైతే విజయం సునాయాసమేనని కాంగ్రెస్ భావిస్తోంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిన బీఆర్ఎస్కు 43.94 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్ 35.03 శాతం ఓట్లతో రెండో స్థానానికి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇక్కడ తన ఓటు శాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది. ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు పునరావృత్తం కావచ్చని అంచనా వేస్తోంది. -
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది: హరీష్‌రావు
హైదరాబాద్: చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయమన్నారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీచ డీఎంఈలు ఎన్ఎమ్సీ ముందు హాజరు కావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శమన్నారు హరీష్‌రావు. ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం.. ఈరోజు కమిటీ వేయడం హాస్యస్పదమన్నాఆరు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న సీఎం రేవంత్.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్‌కు ఎవరు భరోసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన.. మెడికల్ కాలేజీ విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థుల జీవితాలు నిలబెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నట్లు ఉందని సెటైర్లు వేశారు. అందుకే వీలైనంత త్వరంగా జైలుకు పంపించాలని సీఎంను రెచ్చగొడుతున్నారన్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీ నెలకొంది. కవిత జైలుకు పోయివచ్చి బీపీ ఎజెండా ఎత్తుకుంది. ఇప్పుడు నేను వెనుకబడ్డా అనుకుంటున్న కేటీఆర్.. జైలుకు పోయి పథకం రచించాలనుకుంటున్నారు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటున్నాడు’ అని మంత్రి సీతక్క విమర్శించారు. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీతక్క మాట్లాడుతూ.. నేటి సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే తాను అన్నానని, కానీ ఎన్నికల డేట్ చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరిగిందని, అది అవాస్తవమన్నారు. -
మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొకరు మాట్లాడ్డం ఏంటని పీసీసీ ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయోద్దని, మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేతల్ని సున్నితంగా మందలించారు. -
కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుగా నిలిచారు.ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణపై కవిత స్పందించారు. కేటీఆర్‌ను ఏసీబీ విచారణపై కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం. చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదు. మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి. మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమేరైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది.పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్‌ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని వాఖ్యానించారు. -
ఏసీబీ విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏసీబీ విచారణకు వెళ్లిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విచారణకు అంత హంగామా అవసరమా?. ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. పేదోళ్ల సొమ్ము అక్రమ దారి పట్టింది.. అందుకే విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఏదో జరగబోతున్నట్టుగా హల్చల్ చేస్తున్నారు. ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయి. కాళేశ్వరం, ఫార్ములా రేసుపై ఏసీబీ విచారణపై నివేదికల ఆధారంగానే చర్యలుంటాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలకు అంత హంగామా అవసరమా?.త్వరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లకు కట్టబడి ఉన్నాం. పెంచిన రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దు. ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. విడతల వారీగా అర్హలైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
భయపడను.. అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసు(Formula E-Car Race Case) లో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్‌పాలిటిక్స్‌లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని.. ఇలాంటి కేసులో జైలుకు వెళ్తేందుకు కూడా తాను సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఆయన ప్రకటించారు. ‘‘ పైచాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు. ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ-రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్ట్ చేసినా కూడా భయపడను. వెనక్కి తగ్గం. జైలుకు వెళ్తేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్తేమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను. ఫార్ములా ఈ-రేసు అంశం నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు. అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా. చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్‌కు ఇదే నా సవాల్.. లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా నేను సిద్ధమే అని కేటీఆర్(KTR) అన్నారు.అందాల పోటీలు పెట్టీ ప్రపంచం ముందు అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి(Revanth Reddy). కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏం లేదు. రైతుబంధును కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ అక్రమ కేసు. మాకు చట్టం, కోర్టు అంటే గౌరవం ఉంది. అందుకే మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తాను.బీసీలకుకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాం. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమని బీజేపీ అంటుంది. కాంగ్రెస్-బీజేపీవి దొంగాటలు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటాం. జై తెలంగాణ అంటూ ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. అంతకు ముందు.. ఈ ఉదయం కోకాపేట నివాసం నుంచి తొలుత నందినగర్ నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆపై భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. -
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
కేటీఆర్ ఏసీబీ విచారణ అప్డేట్స్.. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణఫార్ములా ఈ కారు రేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణహెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారుల ప్రశ్నలుఏడుగంటల పాటు సాగిన విచారణఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్‌కు ఏసీబీ ప్రశ్నలుకేబినెట్ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారని విచారణ కేటీఆర్ స్టేట్మెంట్ణు రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులుఅవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్‌కు సూచన కేటీఆర్ ఏసీబీ విచారణపై కవిత ఆసక్తిర వ్యాఖ్యలు కేటీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.ఏసీబీ విచారణపై కవిత స్పందించారు‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజంచెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదుమా పార్టీలో లోపాలు సవరించుకుంటాంమా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోంప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడిమా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. గంటలకు పైగా కేటీఆర్‌పై ప్రశ్నం వర్షం. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మొదలైన కేటీఆర్ విచారణ.కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి.ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన బీఆర్ఎస్ శ్రేణులు.ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ..IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..FEOతో ఒప్పందాలు నగదు, బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు.ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..Feo కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ. కేటీఆర్‌తో నలుగురి బృందం.. కేటీఆర్‌తో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నలుగురు బృందం...న్యాయవాది రామచందర్ రావు, మహేందర్ రెడ్డి, తిరుపతి, మరో న్యాయవాది.10.30 గంటలకు మొదలు కానున్న కేటీఆర్ ఏసీబీ విచారణ..ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్రావుఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌ను విచారించనున్న ఏసీబీతెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరిన కేటీఆర్కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఈ-రేస్ కేసులో విచారణకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఎఫ్ఈవో కంపెనీకి రూ. 54.88 కోట్లు బదిలీ చేయడంపై విచారణఇప్పటికే ఏసీబీ అధికారుల లోతైన దర్యాప్తుఅక్రమ కేసులకు భయపడం: కేటీఆర్అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారుఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారు.. ఏం తేల్చారు?అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావొచ్చుచట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉందిమూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తాఅక్రమ కేసులకు భయపడంఅరెస్ట్ చేసినా వెనక్కి తగ్గంజైలు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాంలై డిటెక్టర్‌కు కూడా నేను సిద్ధం కాంగ్రెస్, బీజేపీవి దొంగాటలుడైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ కేసులురైతు బంధును.. ఎలక్షన్ బంధుగా మార్చేశారు420 గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం లక్షలాది మంది కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరుతెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు.తెలంగాణభవన్ వద్ద భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలుతెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..నందిని నగర్ నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు..తాజా పరిస్థితులపై చర్చ..మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్న కేటీఆర్, హరీష్ రావు.. కాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్.. కోకాపేటలో తన నివాసం నుండి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్..మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు చేరుకోనున్న కేటీఆర్..10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు..భారీగా మోహరించి పోలీసులు..ఏసీబీ ఆఫీస్ ముందు 400 మంది పోలీసు బందోబస్తు..ఏసీబీ కార్యాలయం ఎవరిని అనుమతించని పోలీసులు👉తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.👉మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదు. మీ ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డికి సవాల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.I will never be deterred by your enquiries, commissions and political vendettaWe @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP— KTR (@KTRBRS) June 16, 2025👉ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ జనవరి 9వ తేదీన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. -
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, ఏదులాపురం, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి(సోమవారం) కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీపై స్పష్టతనిస్తామని తెలిపారు.తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని.. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని.. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలంటూ ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు.రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తాం. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది. రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని.. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తాం. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి’’ అని పొంగులేటి చెప్పారు. -
తెలంగాణకు మాట.. మూట సాయం కూడా లేదు: కేంద్రంపై హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మాట సాయం, మూట సాయం కూడా కేంద్రం చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్‌కు ఎలా నోటీసులు ఇవ్వాలనే ఆలోచనతోనే రేవంత్ సర్కార్ పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న హరీష్‌రావు.. బనకచర్లకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా?. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని చూశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు. -
కేటీఆర్‌పై ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. .హైదరాబాద్ సీసీఎస్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్సీ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్.. ముఖ్యమంత్రి కూర్చిని గౌరవించాలని మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైంది?.కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుకునే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఇలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ సీఎం. ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నియంత్రణ చేయకుంటే.. మేం కూడా మీరు చేసిన స్కాంలు, అరాచకాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ‘కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిధ్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు. సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్య అంశాల సర్వే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడంతో ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు చేశాం. చరిత్రలోనే తొలిసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 27 శాతం పదవులిచ్చాం. 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఎస్సీలకిచ్చాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 8 మంది రెడ్లు, 4 వెలమలకు మంత్రులుగా అవకాశమిచ్చి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానంతో భేటీ నిమిత్తం మూడ్రోజుల కిందట ఢిల్లీ వచ్చిన సీఎం.. బుధవారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తాం. ఈ మేరకు ఇతర పార్టీలను కూడా కోరతాం. కేంద్రం ఆమోదిస్తే అధికారికంగానూ అమలు చేస్తాం.కులగణన ఆధారంగా నిమ్న వర్గాలకు అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయమై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కమిటీని నియమించాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు ముందుకు వెళతాం. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులో కేసులు తేలిన వెంటనే నిర్వహిస్తాం. ప్రక్షాళన ప్రచారంలో నిజం లేదు పాత మంత్రుల్లో ఎవరైనా తమకు పనిభారం ఎక్కువగా ఉందని చెబితే, వారి శాఖల మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను పంచుతా. శాఖల ప్రక్షాళనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వద్ద 12 శాఖలు ఉన్నాయి. వీటినే కొత్త మంత్రులకు పంచాలని భావిస్తున్నా. మిగతా వారివద్ద ఏయే శాఖలున్నాయి, ఎక్కువ శాఖలున్న మంత్రులు ఎవరిపైనైనా పని భారం ఉందా? అన్న దానిపై చర్చిస్తాం. ఎవరైనా పనిభారం ఉందంటే శాఖలను మారుస్తాం. హైదరాబాద్‌లో అందరితో మాట్లాడి నిర్ణయం చేస్తాం. ‘కాళేశ్వరం’పై రెండ్రోజుల్లో ప్రజల ముందుకు.. కాళేశ్వరం అక్రమార్కులపై కచ్చితంగా చర్యలుంటాయి. రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి కాళేశ్వరంపై నా అభిప్రాయాన్ని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతా. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు ఆరోపణలు చేస్తే, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరంలో అంతా బాగానే ఉందని చెప్పడం ఏంటి? రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే వంద శాతం అడ్డంకి. తెలంగాణ సమస్యలపై ఆయన కేంద్ర కేబినెట్లో ఒక్కసారైనా మాట్లాడారా? రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్ చెన్నైకి, ప్రల్హాద్ జోషి కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు. అలాంటిది తెలంగాణ మెట్రోకు కిషన్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్‌రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రివ్యూ జరుపుతానంటే హైదరాబాద్ సచివాలయంలో లేదంటే.. ఢిల్లీలో.. ఎక్కడైనా అధికారులతో కలిసి సమీక్షకు నేను రెడీ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రానికి శత్రువులు కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి దుష్మన్లు (శతువులు). వారిని, బీఆర్ఎస్ నేతలను నేను ఉన్నంతవరకు కాంగ్రెస్ పారీ్టలో చేర్చుకునేది లేదు. కేసీఆర్ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలోనే చెప్పా. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అసెంబ్లీ రౌడీ సినిమాలో ‘బాషా’బ్యాచ్ లాంటివాళ్ళు. వాళ్ల కుటుంబ పంచాయితీ ఆ సినిమా మాదిరిగానే ఉంది. మీడియా దృషిŠిట్న తమ వైపు తిప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఇప్పటివరకూ దానిపై కేసీఆర్ మాట్లాడలేదు. అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు నక్సలిజం సామాజిక సమస్య. దేశంలో సామాజిక అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు. ఎవరూ అంతం చేయలేరు. సామాజిక అసమానతలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలను చేపట్టింది. ప్రధానిగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’అనే నినాదం ఆదర్శంగా తెలంగాణలో నిరుపేదలకు లక్షల ఎకరాలు పంచారు. ఇళ్లు కట్టించారు. వీటివల్ల నక్సలిజం తగ్గింది. కులగణన సర్వే అమలుతోనూ నక్సలిజం తగ్గుతుంది. -
తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.👉గడ్డం వివేక్- కార్మిక, మైనింగ్ శాఖలు👉వాకిటి శ్రీహరి- పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యూత్ శాఖలు👉అడ్లూరి లక్ష్మణ్- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖకాగా, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. అనంతరం నిర్ణయం తీసుకున్నారు. -
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.అయితే, దేశంలో కోవిడ్-19 నమోదువుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి. -
మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకితెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారారని సీఎం రేవంత్ విమర్శించారు. 'కిషన్‌రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్‌లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టే కిషన్‌రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 11 శాఖల్లో ఏది.. ఎవరికి?మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. -
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై తాజాగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను.ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను.నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే…— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) June 11, 2025 -
రేవంత్ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్‌కు జాబితా
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైకమాండ్‌కు పంపించారు. ఇక, మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ కసరత్తు చేశారు. అనంతరం, అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది.ఇక, సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. -
కమిషన్ విచారణకు కేసీఆర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా..‘కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ.. ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గద. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే!. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు!. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!’ అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే…మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే! బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని… pic.twitter.com/aYrdkAwGXQ— KTR (@KTRBRS) June 11, 2025 -
ఎర్రవల్లి ఫాంహౌస్.. కేసీఆర్‌ను కలిసిన కవిత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. తాజాగా కవిత.. ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ను కవిత కలవడం విశేషం. కవిత.. తన భర్త అనిల్‌తో కలిసి ఎర్రవల్లికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, కేసీఆర్‌తో కలిసి కవిత.. బీఆర్కే భవన్‌కు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ కోసం కేసీఆర్.. ఈరోజు ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బయలుదేరనున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.బరాజ్‌లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. -
నేడు కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బరాజ్‌లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలను సంధిస్తోంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు? వాటికి మంత్రివర్గ ఆమోదం ఉందా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఎందుకు ఏర్పాటు చేశారు? బరాజ్‌లలో నిరంతరం నీళ్లు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? వంటి అంశాలపై కమిషన్ లోతుగా ప్రశ్నిస్తోంది. విచారణ చివరి దశకు చేరడంతో ఈ నెల 6న మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించింది. చివరగా బుధవారం కేసీఆర్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటివరకు కమిషన్ గుర్తించిన అవకతవకతలను కేసీఆర్ ముందు ఉంచుతూ ఆయన నుంచి వివరణ కోరనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ను ప్రశ్నించడంతో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగియనుంది. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి కమిషన్ తన నివేదికను అందజేసే అవకాశం ఉంది. హరీశ్‌రావు సహా ఇంజనీర్లు, నిపుణులతో కేసీఆర్ మంతనాలు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్ సోమ, మంగళవారాల్లో పార్టీ నేత హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలపై ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, సాగునీటిరంగ నిపుణులకు ఫోన్ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సందేహాలను కేసీఆర్ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్‌కు భారీగా తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ కుట్రతోనే తమ అధినేతను విచారణ పేరిట ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతకు సంఘీభావంగా తరలిరావాలని కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
సీఎం శాఖలు సీనియర్లకు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తవారికి పాత మంత్రుల శాఖలు శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. భేటీలో సీనియర్ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మునిసిపల్, విద్య, న్యాయ, మైనింగ్ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరి శాఖల మార్పు జరుగుతుందనేది బుధవారం ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరూ పార్టీ వీడకుండా చూడండి మంత్రి పదవులు ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవులు లభించని సీనియర్ నేతలు సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేంసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులకు ఎలాంటి భరోసా కల్పించాలన్న దానిపై చర్చించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కానీ, వారి అనుచరులు కానీ ఎవరూ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అవసరమైతే నేరుగా నేతలను తమతో మాట్లాడించాలని చెప్పినట్లు సమాచారం. అయితే సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరో మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే సమన్యాయం జరిగినట్టవుతుందని ముఖ్యమంత్రి అన్నారని, దీనిపై మున్ముందు నిర్ణయం చేద్దామని హైకమాండ్ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సాయంత్రం పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బహిరంగ సభలకు యోచన కులగణన, ఎస్సీల వర్గీకరణ, రాజ్యాంగ పరిరక్షణ సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని తెలిసింది. ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను దేశమంతా వివరించే యోచనలో రాహుల్ ఉన్నారని, వాటి నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు 11 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరో బహిరంగ సభ నిర్వహణ యోచనలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ ఎవరో ఒకరు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారని సమాచారం. -
మరోసారి.. కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయన.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. వీరి భేటీ సుమారు 3గంటల పాటు సాగింది. అయితే, ఇవాళ మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. -
చర్చనీయాంశంగా మారిన జానారెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందులో జిల్లా నేతలు ఇద్దరికి చోటు దక్కుతుందని కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచన చేయడంతో జిల్లాకు పక్కా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆదివారం ప్రకటించిన మంత్రివర్గంలో జిల్లా నేతలకు చోటు దక్కకపోవడంతో ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అయితే మంత్రివర్గంలో మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలోనైనా? అవకాశం దక్కుతుందా? ముఖ్యంగా ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం ఇస్తారా? అన్న దానిపై జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది.రాజగోపాల్‌రెడ్డికి మంత్రి వర్గంలో దక్కని చోటుఈసారి మంత్రి వర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చోటు దక్కలేదు. ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినందునే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారన్న చర్చ జరిగింది. అయితే మొదటి మంత్రివర్గంలో రాజగోపాల్‌రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు దక్కడంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపకపోవడంతో రాజగోపాల్‌రెడ్డికి అప్పట్లో చోటు దక్కలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడి భువనగిరి ఎంపీ గెలుపు బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన అన్నీ తానై ఆ బాధ్యతను భుజాన వేసుకుని భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ వర్గాలతో పాటు జిల్లా అంతటా జోరుగా ప్రచారం సాగింది.వాయిదా పడుతూ విస్తరణ..పార్లమెంట్ ఎన్నికల నాటినుంచి మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ వార్తలు వెలువడినా.. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన అలకవహించినట్లు చర్చ జరగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆదివారం రాత్రి వరకు వారికి అందుబాటులోకి రాలేదు.బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని మొన్నటి వరకు చర్చ మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లంబాడా కోటాలో మంత్రి పదవిని ఇవ్వాలని గతంలోనే అధిష్టానాన్ని అడిగారు. ఆ దిశగా అధిష్టానం కూడా మొగ్గు చూపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నందున, మరో రెండు మంత్రి పదవులు ఇస్తే ఇతర సమస్యలు వస్తాయన్న ఆలోచనతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని అసెంబ్లీ సమావేశాల సమయంలో జోరుగా చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా బెర్తు దక్కలేదు.చర్చనీయాంశంగా మారిన జానా లేఖరెండు నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో రాజగోపాల్‌రెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. కొన్నాళ్ల తరువాత ఆ చర్చ సద్దుమణిగినా ప్రస్తుతం విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి, బాలునాయక్‌కు పదవులు దక్కలేదు. -
ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్.. మాదిగ, గడ్డం వివేక్.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్ వర్గీయుడు. -
స్కూలింగ్ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్ వద్ద
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే వారికే నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారంతా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్ బీజేపీలో, కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద చేసి, ఉద్యోగం రాహుల్‌గాంధీ వద్ద చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ హరిబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ. ‘ఇటీవల నీతి అయోగ్ సమావేశం అనంతరం భోజన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నీ సహచరుడు అక్కడున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపించారు. అందుకు నేను స్పందిస్తూ.. నా స్కూలింగ్ అంతా మీ వద్ద (బీజేపీ) జరిగింది. కాలేజీ స్టడీ ఆయన (చంద్రబాబు) దగ్గర, ఇప్పుడు ఉద్యోగం రాహుల్‌గాంధీ వద్ద చేస్తున్నా అని బదులిచ్చాను. నాకు చాలామంది బీజేపీ నేతలతో స్నేహముందని వివరించాను’అని వెల్లడించారు. దత్తాత్రేయ ప్రజల మనిషి హోదాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్ కొనియాడారు. ‘దత్తాత్రేయ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రజల మనిషి. అందుకే అన్నిపార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. గౌలిగూడ నుంచి గవర్నర్ వరకు ఎన్నో పదవుల్లో కొనసాగిన దత్తాత్రేయ నిత్యం ప్రజలు, కార్యకర్తలతోనే ఉంటారు. హైదరాబాద్‌లో మాస్ నేతలు ఇద్దరే. ఒకరు పీ.జనార్ధన్‌రెడ్డి, మరొకరు బండారు దత్తాత్రేయ. నగర ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వీరిలో ఒకరికి చెప్పుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలి’అని సూచించారు. కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన తాను తెలుగు రాష్ట్రాలను రెండో ఇళ్లుగా పరిగణిస్తానని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బండారు దత్తాత్రేయతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మీక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మీకుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ సేవలు మెరుగపర్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దత్తాత్రేయ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, ఆయనను హరియాణా గవర్నర్‌గా నియమించారు. అక్కడ జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని ఆయననే అడిగాను. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని దత్తాత్రేయ చెప్పారు’అని కోవింద్ వివరించారు. లేఖలకు బ్రాండ్ అంబాసిడర్: చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. నిబద్ధత, అంకితభావం, జాతీయత, సేవ, సమగ్రత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాయ్ బలాయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలు అంశాలపై దత్తాత్రేయ పెద్ద సంఖ్యలో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్ అంబాసిడర్ అని చమత్కరించారు. దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం లేదు: వెంకయ్యనాయుడు బండారు దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదని, ప్రజలే ఆయన జీవితమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రస్తుత నాయకులు డైపర్స్ మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారుతుండటంతో రాజకీయాలు చులకన అయ్యాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదని బండారు దత్తాత్రేయ అన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు సమాజంతో మమేకం అవ్వాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడితే పదవులు అవే వస్తాయని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలే తన కుటుంబమని, వాళ్లే తన ఆస్తి అని చెప్పారు. అలాయ్‌బలాయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యకక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.