breaking news
-
‘రేవంత్.. మీకు, మీ హైడ్రాకు ఇవేమీ కనబడవు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ప్రధానంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు అనేక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ‘ కొడంగల్‌లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడడఇకి దుర్గం చెవురు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు. మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్‌లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు. కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. ఇవేమీ మీకు, మీ హైడ్రాకు కనబడవు’ అని ప్రశ్నించారు.మిస్టర్ రేవంత్ రెడ్డి, ⭕️ నువ్వు కొడంగల్‌లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు ⭕️ మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు FTLలో ఇల్లు ఉండవచ్చు ⭕️ మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు ⭕️ మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు⭕️… pic.twitter.com/Vnuqyfb6i2— KTR (@KTRBRS) July 1, 2025 -
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని.. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలి. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నాం’’ అని బీజేపీ పేర్కొంది.కాగా, రాజాసింగ్ తీసుకున్న సంచలన నిర్ణయం.. తెలంగాణ బీజేపీలో కల్లోలం రేపుతోంది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా.. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా.. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
Raja Singh: ఆ గ్యాప్ కొనసాగుతూనే వచ్చింది..
రాజాసింగ్.. నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఓ సంచలనం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజాసింగ్ కచ్చితంగా ఉంటారు. అయితే పార్టీకి ఉన్నపళంగా రాజీనామా చేశారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి నామినేషన్ వేయడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్.. ఆపై కొద్ది సేపటికే పార్టీకి గుడ్ బై అంటూ ప్రకటించారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా’ అని రాజాసింగ్ ప్రకటించారు. అసలు బీజేపీ అధిష్టానంతో రాజాసింగ్‌కు గ్యాప్ ఎలా ఏర్పడింది.. ఎక్కడ ఏర్పడింది అనే అంశాల్లో కొన్నింటిని పరిశీలిస్తే..ఆనాటి గ్యాప్.. కొనసాగుతూనే వచ్చింది..!రాజాసింగ్ అంటే బీజేపీ అధిష్టానానికి నమ్మకం. అది ఒకప్పుడు మాట. అది క్రమేపీ దూరం అయ్యింది. మూడేళ్ల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు రాజాసింగ్. 2022లో నుపూర్ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై ఆమెను బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత, రాజాసింగ్ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు. ఇది బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబట్టినట్లయ్యింది. అధిష్టానాన్ని చాలెంజ్ చేసినట్లు ఉండటంతో రాజాసింగ్‌ను వివరణ ఇవ్వాలని కోరింది అధిష్టానం. ఈ క్రమంలోనే రాజాసింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. 2022 ఆగస్టు 23వ తేదీన రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ 22వ తేదీన రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరికింది రాజాసింగ్‌కు. అయితే అప్పట్నుంచి అధిష్టానంతో గ్యాప్ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడిచింది. అధిష్టానం రాజాసింగ్‌ను హైదరాబాద్ నుంచి పోటీ చేయించాలని చూసింది. ఇక్కడ రాజాసింగ్ మాత్రం ఎంపీగా విముఖత వ్యక్తం చేసిన కారణంగానే ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారనేది మరో చర్చ. సస్పెన్షన్ గురైన సందర్భంతో పాటు తరచూ వివాదాలు కూడా రాజాసింగ్-అధిష్టానం మద్య గ్యాప్‌కు కారణమైంది. ఇటీవల కాలంలో పార్టీ లైన్‌కు భిన్నంగా రాజాసింగ్ వ్యవహరించడంతో ఆయన్ను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సైతం రాజాసింగ్ మద్దతు పలికారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్ధించారు. ఇవన్నీ కూడా అధిష్టానానికి కోపం తెప్పించాయి. రాజాసింగ్ రాజీనామా చేసే క్రమంలో అధిష్టానం పెద్దలు ఎవరూ కూడా ఆయన్ను బుజ్జగించే పని చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా చూసుకుంటే 2022 నుంచే అధిష్టానంతో రాజాసింగ్‌కు సఖ్యత చెడిపోతూ వచ్చిందని, అదే ఇంతవరకూ తెచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్ మా పార్టీ సింబల్ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని, సస్పెండ్ చేయాలని కిషన్‌రెడ్డే స్పీకర్‌ను కోరాలి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు. -
‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్‌లో భాగమే’
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి. బీజేపీ-బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. ఈరోజు(సోమవారం, జూన్ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్‌కుమార్‌రెడ్డి‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్‌తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్‌లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్‌రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్ నగర ప్రజకు కిషన్‌రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్‌రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే.. -
హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తోందని.. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.హైదరాబాద్, సాక్షి: మాదాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం గరం అయ్యారు. చెరువును బఫర్ జోన్ చేయకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడ్డారాయన. ‘‘చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. కానీ, హైడ్రా తీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సున్నం చెరువు బఫర్ జోన్ చేయకుండా కూల్చివేతలు చేపట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ను కలుస్తా’’ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇదిలా ఉంటే.. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పలువురు ప్రొక్లెయిన్‌కు అడ్డం పడి హైడ్రా డౌన్ డౌన్.. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. -
పాశమైలారంలో ఇది మూడో ఘటన: హరీష్‌రావు
పాశమైలారం ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బాధితులకు భారీగా పరిహారం అందించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారాయన. సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాశమైలారంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఇది మూడో ఘటన. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి. ఎంత మంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. గాయపడిన వాళ్లకు రూ. 50 లక్షలు అందించాలి’’ అని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. గాయపడ్డ 26 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. వాళ్లకు మెరుగైన వైద్యం అందాలి. అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి అని హరీష్ రావు కోరారు. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా ప్రాంతం కుప్పకూలిపోగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
బీజేపీ అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకంపై కాషాయ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి రాజాసింగ్ విమర్శలు గుప్పించారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధిష్టానం ఖరారు చేసింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలి. అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేసి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో రాజాసింగ్.. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. నన్ను నియమిస్తే.. పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తా. గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతా. బీజేపీ అవసరాన్ని గడపగడపకు చాటిచెబుతా. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. వీఐపీలా ఉండే వారు కాకుండా.. హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తినే నియమిస్తే బాగుంటుంది. రాజాసింగ్ అధ్యక్షుడు కావొద్దని అడ్డుకునే ఒక బృందం పనిచేస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. -
బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్‌కు తెరపడినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం ఉదయం హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే.. అందరి సమ్మతితో ఎన్నిక జరిపే విధంగా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు.. తెలంగాణలో బీజేపీలోని కీలక నేతలకు హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు అధికారికంగా అధ్యక్ష అభ్యర్థికి సమాచారం ఇస్తామన్న హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అందరూ అందుబాటులో ఉండాలంటూ పలువురు నేతలకు సమాచారం ఇచ్చారు. దీంతో, సదరు నేతలంతా 11 గంటలకు వచ్చే కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది.అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. -
కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి తరుణంలో కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.తాజాగా వరంగల్‌లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ..‘గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది.. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నా పోటీ ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా నాకు ఎవరి పైసా అవసరం లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అలాగే, నేను ఎవరికీ భయపడను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో కొండా దంపతుల రాజకీయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్‌కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు.అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. ‘‘నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది’’ అని పేర్కొన్నారు. -
నై.. తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు: హరీశ్‌రావు
అమరచింత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ‘నై తెలంగాణ’అన్న వ్యక్తి, నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, తన పాటల తూటాలతో రేవంత్‌ను అక్కడి నుంచి తరిమికొట్టిన ఘనత సాయిచంద్కే దక్కిందన్నారు.అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేలుతు న్నారని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణ వాది అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతు న్న సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మరచిపోతున్నార న్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే... విత్‌డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది. -
కాంగ్రెస్‌కు ఏటీఎం: అమిత్‌షా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్‌షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్‌కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్‌బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్‌కు భారత్ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్ సర్కార్.. పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్‌షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్ ఏరివేతకు అపరేషన్ కగార్ చేపట్టాం. (ఆపరేషన్ కగార్ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతోంది..’ అని అమిత్‌షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
‘నేను కూడా అధ్యక్ష పదవి అడగాలనుకుంటున్నా’
హైదరాబాద్: మరో రెండు రోజుల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు(సోమవారం, జూన్ 30వ తేదీ) నామినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఎవరికి వారే తానే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారని రాజాసింగ్ అన్నారు. తనకు అనేక మంది కార్యకర్తలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారన్నారు. మనం ఎందుకు ప్రెసిడెంట్‌గా పోటీ చేయకూడదని చాలా మంది అడుగుతున్నారన్నారు. అందుకే తాను కూడా అధ్యక్ష పదవి అడగాలని అనుకుంటున్నానని తెలిపారు. చాలా మంది కార్యకర్తల మనస్సులో ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలో అనుకునే విషయాన్ని రాజాసింగ్ పేర్కొన్నారు‘బీజేపీకి వీఐపీ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఉండకూడదు. కార్యకర్తలు అన్న అని పిలిచే ప్రజల మనిషి అయిన వారు ప్రెసిడెంట్ గా ఉండాలి. నేను ప్రెసిడెంట్ అయితే గోరక్ష కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేస్తా. బీజేపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అండగా ఉండేలా ఏర్పాట్లు చేస్తా.. నేరుగా కలిసే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్టైల్ లో ముందకు వెళ్తాం. యోగి పేరు వింటే దొంగలు, గూండాలు, రౌడీలు యూపీ వదలి వేరే రాష్ట్రానికి పారిపోతున్నారు. ఆ సిస్టమ్ ను తెలంగాణలో అమలు చేస్తాం. రాజాసింగ్ ప్రెసిడెంట్ కావాలి అనుకునే వాళ్లు నా పేరును కేంద్ర నాయకులకు చెప్పండి’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. -
‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’
నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని, అందుచేత బీజేపీకి అధికారం ఇవ్వాలని బండి సంజయ్ విన్నవించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ‘ రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్ రైతులు హీరోలు. ధర్మపురి అరవింద్ పసుపు అరవింద్ అయ్యారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్న ప్రసంగానికి ఆహ్వానించిన క్రమంలో సభ చఘ్పట్లతో దద్దరిల్లింది. ప్రజా స్పందనను ఆస్వాదిస్తూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు అమిత్ షా. దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా -
కాంగ్రెస్‌లో ‘కొండా’ కల్లోలం.. ఆ పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర భేటీ
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ రాజకీయాలు.. అధికార కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. కొండా మురళీ లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్‌తో సహా పలువురు భేటీ అయ్యారు.కాగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమైన సంగతి తెలిసిందే. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు.ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. -
‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం’.. ఎంపీ రఘనందన్‌కు మరో బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: రోజుల వ్యవధిలో మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘనందన్ బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత వారం బెదిరింపు కాల్గత వారం ఎంపీ రఘునందన్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
జూబ్లీహిల్స్‌లో విజయం మాదే: పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. విజయం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలని సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి అని అన్నారు.ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘జూలై నాలుగో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలి. హైదరాబాద్‌లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నేతలు సభలో పాల్గొనాలి. సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా ఉండాలి. హైదరాబాద్‌లో పార్టీకి సంబంధించిన ఇష్యూ నా దృష్టికి వచ్చాయి.దేవాలయ కమిటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ తదితర ప్రోటోకాల్ సమస్యలపై చర్చించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి నామినేటెడ్ పోస్టులు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ప్రభుత్వ సంక్షేమమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. కొత్త నాయకుడెవరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక, జూలై ఒకటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది.కాగా, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికకి నోటిఫికేషన్ విడుదల కానుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై ఒకటో తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన చేస్తారు. అయితే, తెలంగాణ బీజేపీ ప్రముఖంగా ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని సారథ్య బాధ్యతలు వరించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం వరకు కొత్త అధ్యక్షుడి అభ్యర్థికి అధిష్టానం సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటరు జాబితా రెడీ అయ్యింది. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. నామినేషన్ వేయాలా వద్దా అనేదానిపై తర్వాత నిర్ణయించుకుంటానని రాజాసింగ్ తెలిపారు.అయితే, అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ సుదీర్ఘ కసరత్తు, అనేక సమీకరణాలు, వడపోతల తర్వాత.. చివరగా రేసులో ఇద్దరే ఇద్దరు నేతలు మిగిలారు. వాళ్లే ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్. అధ్యక్ష పదవిపై బయటికి చెప్పకపోయినప్పటికీ.. పార్టీలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు.ఈటల Vs అరవింద్..బీజేపీ పార్టీకి విధేయుడిగా ధర్మపురి అరవింద్‌కు గుర్తింపు ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌షాకు సన్నిహితుడిగాను ఆయన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సూటిగా విమర్శలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. మిగతా నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, బలమైన రాజకీయ నేపథ్యం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఇక ఈటల రాజేందర్‌ను తీసుకుంటే.. తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా ప్రజాదరణ ఉంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉండడంతో పాటు ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై అవగాహన ఉంది. పార్టీలో చేరినప్పుడు అధిష్టానం ఇచ్చిన హామీ కూడా ఆయనకు అనుకూలమైన అంశమే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో, కొత్త నాయకుడు ఎవరు అనే చర్చ మొదలైంది. -
కొండా లేఖ కలకలం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు. ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.మా సాయం పొంది.. మాకే వ్యతిరేకంగా.. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ములుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని మురళి తెలిపారు. మంత్రులు సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం శ్రీహరి మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల పూర్తిగా తమ నియోజకవర్గమేనని, అందులోనే తమ స్వగ్రామం ఉందని గుర్తుచేసిన ఆయన.. ఎన్నికల సమయంలో రేవూరి అభ్యర్థన మేరకు మనస్ఫూర్తిగా సహకారం అందించినట్లు తెలిపారు. అయినా ప్రకాశ్‌రెడ్డి తమకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్æ వెస్ట్) కూడా ఎన్నికల సమయంలో తమ మద్దతు కోరారని, ఇప్పుడు తమ నియోజకవర్గంలోకి వచ్చి (వరంగల్ ఈస్ట్) ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. తమ పరిధిలోనికి వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తమతో బాగానే ఉంటున్నారని వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జి ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, కేడర్‌ను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, డోర్నకల్ రాంచంద్రునాయక్లతో కూడా తమకు ఇబ్బంది లేదని మురళి తెలిపినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటివరకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదని తెలిపారు. మా పవర్ గురించి చెప్పాల్సిన పనిలేదుతాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో వచ్చారని, వరంగల్‌లో కొండా దంపతుల పవరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆ లేఖలో మురళి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఆ లేఖ గురించి తనకు తెలియదని, బయట ఏం ప్రచారం జరుగుతుందో తన దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొండా మురళి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
‘మిస్టర్ రేవంత్.. మీ తెలివి తక్కువ నిర్ణయాలను మేం రద్దు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు మార్చడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. ఢిల్లీ బాస్‌లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విధేయతను చూపించాలనుకుంటే.. మీ పేర్లను రాజీవ్ లేదా జవహర్‌గా మార్చుకోండి అంటూ చురకలంటిచారు.ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం.. సిగ్గుచేటు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివి తక్కువ నిర్ణయాలను రద్ద చేస్తాం. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలకు చరమగీతం పాడతాం’ అని కేటీఆర్ హెచ్చరించారు. Mr. Revant Reddy, If you want to show your subservience to Delhi bosses, why don’t you change your own name to Rajiv or Jawahar ? Renaming Annapurna canteens is absolutely ridiculous and shameful We shall undo all of these senseless actions in 2028 when BRS is back at the… https://t.co/ufWwUWyXu2— KTR (@KTRBRS) June 28, 2025 -
బిగ్ ట్విస్ట్.. కొండా మురళీకి మళ్లీ నోటీసులు
గాంధీభవన్‌లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఉల్టా వరంగల్ నేతలపైనే ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు ట్విస్ట్ ఇచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలోని సొంత పార్టీనేతలపై కొండా మురళి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతీకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళిని హాజరయ్యారు. కమిటీ ముందు తనపై ఫిర్యాదు చేసిన నేతలపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వని అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. కొండా ఇచ్చిన సమాధానం తర్వాత మిగత ప్రక్రియ ఉంటుందని కమిటీ తెలిపింది. కొండా మురళి ఇచ్చింది వివరణ కాదు: మల్లు రవికొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌తో పాటు,క్రమ శిక్షణా కమిటీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. ఈ తరుణంలో ఇవాళ గాంధీ భవన్లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు. ఇదే అంశంపై క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి చిట్‌చాట్ నిర్వహించారు. కొండా మురళీకి నేనే ఫోన్ చేశా. ఇవాళ కమిటీ ముందుకు వచ్చారు. కొండా మురళీ ఇచ్చింది వివరణ కాదు. ఇది ఆరంభం మాత్రమే. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నాం.మా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కొండా మురళీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరాను. వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాము. ఏ ఫిర్యాదులు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని కోరినట్లు చిట్‌చాట్‌లో మల్లు రవి వెల్లడించారు. మళ్లీ రేవంత్ అన్నే సీఎం: కొండా మురళిఇక క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు. దయ చేసి నన్ను గెలకొద్దు. రాహుల్ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగగ్రెస్ను గౌరవిస్తాను. రేవంత్ అన్న మళ్లీ సీఎం అవ్వాలి. బీసీ నాయకుడు మహేష్ అన్నకు మరిన్ని పదవులు రావాలి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది నా అంతరాత్మకు తెలుసు. నేను కేసులకు బయపడేవాడిని కాదు.’ అని వ్యాఖ్యానించారు. -
కొండా మురళి ఎపిసోడ్లో ట్విస్ట్
ఓరుగల్లు కాంగ్రెస్ వర్గపోరు పంచాయితీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. వరంగల్ జిల్లా నేతలపైనే ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది.హైదరాబాద్, సాక్షి: కొండా మురళి వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్‌కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీకి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిపై ఆయన క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. అందులో.. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని, అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని.. అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్లిద్దరితో పాటు నాయిని రాజేందర్‌రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణా కమిటీని కోరారు. ఈ నివేదికను కమిటీ స్వీకరించింది.క్రమశిక్షణ కమిటీతో కొండా మురళీ..కమిటీ ముందుకు రావాలని ఎవరూ నన్ను పిలవలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా. భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేయాలనుకున్నా. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ పోటీ చేసింది కాబట్టి నేను తప్పకున్నా. మరో పార్టీ నుంచి గండ్ర వచ్చినా ఆయన మద్దతు ఇచ్చి ప్రచారం చేశా. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. కొండా సురేఖ-సీతక్కలు కలిసే పని చేసుకుంటున్నారు. సీతక్కతో మాకు పంచాయితీ లేదు. వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారు. కడియం కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పరకాల పూర్తిగా మాదే. రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశాం. అతనిప్పుడు మాపై గుడుపూటానీ రాజకీయాలు చేస్తున్నారు. మా మద్దతుతోనే రేవూరి గెలిచారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నారు. నాయిని తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడు. వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి నేనే కారణమని నాపై కోపంగా ఉన్నట్టున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చాను. పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చా. కొంతంది లాగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను అని కమిటీకి నిచ్చిన లేఖలో పేర్కొన్నారాయన. వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేశాయి. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు కొండా మురళి సుమారు 60 వాహనాల్లో.. భారీ అనుచరగణంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు బయల్దేరినట్లు వచ్చారు. లోపలికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెవరూ వివరణ ఇవ్వాలని కోరలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా’’ అని అన్నారు. తన వివరణకు సంబంధించిన ఆరు పేజీల పత్రాన్ని ఆయన సమర్పించినట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో కొండా మురళి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నది అభియోగం. ఆ వ్యాఖ్యలతో ఓరుగల్లు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ కోరింది. అలాగే.. ఆయన తన కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించడమే కాకుండా, కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేయడం పార్టీ లోపలే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రధానంగా.. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు కలిసి అత్యవసరంగా సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని AICC తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జోక్యంతో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. -
‘నేను కదా ఫోన్ ట్యాపింగ్ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్లా రోజుకొకరిని పిలుస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ములాఖత్ అయ్యి పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం కమిషన్, ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే. కాంంగ్రెస్‌కు కేసులలో చిత్తశుద్ధి లేదు. ఇండిరమ్మ ఇళ్లు రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదు’ అని రఘునందన్‌రావు మండిపడ్డారు.అన్నపూర్ణా క్యాంటీన్ల పేరు ఎందుకు మారుస్తున్నారు?జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితజ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటిన్ల పేర్లు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్ పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు. -
ముఖ్యమంత్రి స్థానంపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు.. ఆయన దిగిపోయాక నేను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసి కేసీఆర్ కూతురు మినహా ఆమెకు ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నించారు.తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కోసం ఇప్పటకే తన అప్పీల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఉంచారు. వచ్చే తొమ్మిదేళ్ల తర్వాత సీఎం కావాలనే టార్గెట్‌తో నేను పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ దిగిపోయాక.. నేను ముఖ్యమంత్రి స్థానం కోసం ప్రయత్నిస్తాను. ప్రజల దగ్గర అప్లికేషన్ పెడతాను. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్‌తోనే నడిచింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిఘా పెట్టారు. నా ఫోన్ ట్యాప్ అయిందని చాలా సార్లు చెప్పారు.. పోలీసులే మాకు చెప్పేవారు. గత పదేళ్లు బీఆర్ఎస్.. పరిపాలనను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్ మీదే పడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ట్యాపింగ్‌తోనే పరిపాలన చేశారు. భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు రికార్డు చేశారు.కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. కవిత ఓవరాక్షన్ చేస్తున్నారు.. అంత అవసరం లేదు. కేసీఆర్ కూతురు మినహా మీకు ఉన్న అర్హత ఏంటి. కేసీఆర్, కేటీఆర్ రిజెక్ట్ చేసినా పొలిటికల్ ఇమేజ్ కోసం కవిత ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ స్థాయి ఒక్కటే. వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తే ఆర్థం ఉంది.. కవిత స్థాయి ఏంటి?. కవిత ఒక మాఫియా డాన్ అయిపోయింది. ఆమె వల్ల కేజ్రీవాల్, సిసోడియా ఖతమైపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు 5,6 నెలలకు వేసేవారు. మా ప్రభుత్వంలో 9 రోజుల్లోనే 9వేల కోట్లు జమ చేసాం. వారు చేయలేని పని కాంగ్రెస్ చేసిందనే అసూయతో హరీష్ రావు మాపై విమర్శలు చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.