
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్-బీజేపీ బంధం బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్,బీజేపీ తీరును ప్రశ్నిస్తూ సోమవారం తెలంగాణ భవన్‌లో వేముల మీడియాతో మాట్లాడారు.
సీబీఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. బీజేపీ ,సీఎం రేవంత్ రెడ్డి స్నేహ బంధం బయట పడింది. సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డు తగిలారు. బీజేపీ సభ్యుడిని కాంగ్రెస్ ఉపయోగించుంది. ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీకి 90 నిమిషాలు ఇచ్చారు. కాంగ్రెస్,బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ స్క్రిప్ట్‌నే పాల్వాయి హరీష్ మాట్లాడారు. హరీష్‌రావు ప్రసంగాన్ని కాంగ్రెస్,బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు.