వివో వి7ప్లస్‌ లాంచ్‌.. భారీ సెల్పీ కెమెరా | Vivo launchef the Vivo V7+ today in India | Sakshi
Sakshi News home page

వివో వి7ప్లస్‌ లాంచ్‌.. భారీ సెల్పీ కెమెరా

Sep 7 2017 2:21 PM | Updated on Sep 12 2017 2:10 AM

చైనా మొబైల్‌ ఉత్పత్తిదారు వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ‘వీ7ప్లస్‌’ గురువారం ఇండియన్‌ మార్కెట్లో లాంచ్‌ చేసింది.



సాక్షి,  న్యూఢిల్లీ:
చైనా మొబైల్‌  ఉత్పత్తి దారు వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  ‘వీ7ప్లస్‌’ పేరుతో  గురువారం ఇండియన్‌ మార్కెట్లో లాంచ్‌ చేసింది.  క్లియర్‌ షాట్‌, క్లియర్‌ మూమెంట్‌ అంటూ అతిభారీ  సెల్ఫీ  కెమెరాతో  దీన్ని కస్టమర్లకు అందించనుంది. వివో ఇండియా ప్రెసిడెంట్‌ కెంట్‌ చెంగ్‌,  వివో బ్రాండ్‌  అంబాసిడర్‌ రణ్‌వీర్‌ దీన్ని అధికారికంగా లాంచ్‌ చేశారు.దీని ధరనురూ. 21,990 గా ప్రకటించింది. మాట్ట్ బ్లాక్ అండ్ గోల్డ్  కలర్స్‌లో  ప్రీ-ఆర్డర్ల కోసం   ఫ్లిప్‌కార్ట్‌ , అమెజాన్ లో సెప్టెంబరు 15 వరకు అందుబాటులో ఉంది. ఇక లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే..  ఫ్రీ స్క్రీన్‌  రిప్లేస్‌మెంట్‌,   ఏ డివైస్‌ తోనైనా ఎక్సేంజ్‌  ద్వారా డిస్కౌంట్‌,   ఒక జత బుక్‌ మై షో టికెట్స్‌ ఉచితం.



వివో  వీ 7 ప్లస్‌ ఫీచర్లు
5.9 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1నౌగట్‌
1440 x 720  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
16ఎంపీ రియర్‌ కెమెరా
24 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే సౌలభ్యం కూడా
3225 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement