జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్..!
ఉచితడేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్లతో ఎంజాయ్ చేస్తున్న రిలయన్స్ జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్. జియో కస్టమర్ల డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు రేపుతోంది.
	ముంబై: ఉచితడేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్లతో   ఎంజాయ్ చేస్తున్న రిలయన్స్ జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్. జియో కస్టమర్ల డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయిందన్న వార్త  ఇపుడు ప్రకంపనలు రేపుతోంది.   జియో వినియోగదారుల సమాచారం ప్రస్తుతం  ఒక వెబ్‌సైట్‌లో అందుబాటులోఉందన్నవార్త హల్ చల్  చేస్తోంది.
	లక్షల కొద్దీ  రిలయన్స్ జియో కస్టమర్ల  వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో మాజిక్ ఏపీకే.కాం అనే వెబ్‌సైట్‌లో లీక అయిందనే  కథనాలు  ఆదివారం  వెలువడ్డాయి.  సంబంధిత వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌ను  కొంతమంది  ట్విట్టర్‌లో  షేర్ చేశారు.   జియో కస్టమర్ల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్‌తదితర సమాచారం  ఈ సైట్ లో దర్శనిమస్తున్నాయని ట్వీట్ చేయడంతో  దుమారం రేగింది.  డేటాబేస్ ఉల్లంఘన  ఏమేరకు  ఉంది అనేది మాత్రం ఇప్పటికీ  అస్పష్టంగానే ఉంది.  
	అయితే ఈ వార్తను జియోతీవ్రంగా ఖండించింది. వదంతులను నమ్మవద్దని వివరించింది.  మరోవైపు ఈ  వార్తలను రిలయన్స్ జియో  కొట్టిపారేసింది. తమ  వినియోగదారుల డేటా సురక్షితంగా ఉందని గట్టిగా వాదిస్తోంది. ఎలాంటి   డేటా లీక్ కాలేదని  జియో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.  తమ కస్టమర్ల  డేటా  భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అనంతరం డేటాలీక్ అనేది అవాస్తవమని, నిరాధారనమైనదని  జియో  తేల్చింది.   దీనిపై మరింత విచారణ కొనసాగుతోందని చెప్పారు.
	
	కాగా  రిలయన్స్ జియోలో  సుమారు 120 మిలియన్ల  మంది  ఖాతాదారులు ఉన్నట్టు అంచనా.
	

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
