40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

President  Ram Nath Kovind visits Athi Varadar Swamy - Sakshi

సాక్షి, కాంచీపురం: నలబై ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే కాంచీపురంలోని అత్తివరదర్ స్వామి కోసం  భక్తులు పోటెత్తారు. ఇక్కడి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కొలువైన అత్తివరదర్ స్వామి 40 ఏళ్లకోసారి దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అత్తివరదర్‌ స్వామి దర్శన కార్యక్రమాన్ని  తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పూజాది లాంఛనాలతో ప్రారంభించగా... గత 15 రోజులుగా స్వామి దర్శనం కోసం భక్తుల వస్తూనే ఉన్నారు. దేశం నకుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. 

ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులతోపాటు లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. తమిళులకు శుభంగా భావించి శుక్ర, శనివారాల్లో భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో వరదరాజ పెరుమాళ్ ఆలయ పరిసరాలతోపాటు కాంచిపురంలో తిరుమాడ వీధులు జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top