చుక్కలు తాకిన హెల్మెట్ ధరలు | Your helmet just got costlier | Sakshi
Sakshi News home page

చుక్కలు తాకిన హెల్మెట్ ధరలు

Jan 23 2016 9:23 AM | Updated on Sep 3 2017 4:10 PM

చుక్కలు తాకిన హెల్మెట్ ధరలు

చుక్కలు తాకిన హెల్మెట్ ధరలు

ద్విచక్రవాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో కూడా ఈ నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

మైసూరు : ద్విచక్రవాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో కూడా ఈ నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఈ నిబంధనను పాటించని వారికి పోలీసులు ఫైన్ విధిస్తుండడంతో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ల కోనుడానికి మొగ్గు చూపుతున్నారు.

దీంతో హెల్మెట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. రోజుకు సగటున 500 నుండి 700 హెట్మెట్లు అమ్ముడవుతున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో సమారు1.37 కోట్ల ద్విచక్రవాహనాలు ఉండగా హెల్మెట్లు కేవలం 20నుంచి 30లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

దీంతో హెల్మెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగి ధరలు సైతం అమాంతంగా పెరిగాయి. గతంలో రూ.400 ఉన్న సాధారణ హెల్మెట్ ధర ఇప్పుడు రూ.900 ఉండగా, ప్రభుత్వ గుర్తింపుగల ఐఎస్‌ఐ స్టాండర్డ్ హెల్మెట్ ధర రూ.2,500 నుంచి రూ.5,000 ధర పలుకుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement