పురుగుల మందు తాగి టిక్‌టాక్ | Young Man Suicide In Tumkur | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి టిక్‌టాక్

Jun 8 2020 6:39 AM | Updated on Jun 8 2020 7:10 AM

Young Man Suicide In Tumkur - Sakshi

ధనంజయ్‌   

సాక్షి, కర్ణాటక : జీవితంలో ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. ఆ అనుభవం ఎలా ఉంటుందో చవిచూడాలని, దానిని టిక్‌టాక్‌ చేయాలని ఒక యువకుడు దుస్సాహసం చేశాడు. ఆ ప్రయత్నంలో పురుగుల మందు తాగి మరణించిన సంఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలుకాలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత యువకుడు కొరటిగెరె తాలూకాలోని గౌరగానహళ్ళి గ్రామానికి చెందిన ధనంజయ (25).

ఇతనికి టిక్‌టాక్‌ వీడియోలు చేయడమంటే మోజు. చనిపోతే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ పొలాలకు కొట్టే పురుగుల మందు తాగి వీడియో తీసుకున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు గమనించి కొరటిగెరెలో ఉన్న ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కొరటిగెరె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement