నయీం వార్తలు చదివి.. | young man arrested over threats in the name of nayeem | Sakshi
Sakshi News home page

నయీం వార్తలు చదివి..

Oct 20 2016 3:54 PM | Updated on Aug 1 2018 2:31 PM

నయీం వార్తలు చదివి.. - Sakshi

నయీం వార్తలు చదివి..

ఈజీ మనికోసం ఓ యువకుడు గ్యాంగ్ స్టర్ నయూం ను ఆదర్శంగా తీసుకున్నాడు.

- వ్యాపారులకు బెదిరింపులు
కల్వకుర్తి: ఈజీ మనికోసం ఓ యువకుడు గ్యాంగ్ స్టర్ నయూం ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించిన వార్తలు చదివి అదే స్థాయిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే పలువురు వ్యాపారులను డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. ప్రసారమాధ్యమాల్లో నయీం ప్రధాన అనుచరుడిగా వినిపించిన శేషన్న పేరును వ్యాపారులను బెదిరించడానికి ఉపయోగించుకున్నాడు.
 
వివరాలు.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన సతీష్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. నయీం అనుచరుడు శేషన్న పేరుతో మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు వ్యాపారులను బెదిరించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన కల్వకుర్తి పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement