మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లిలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన వెలుగుచూసింది.
యువతిపై లైంగిక దాడి.. హత్య
May 16 2017 12:00 PM | Updated on Oct 8 2018 5:19 PM
మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లిలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన వెలుగుచూసింది. 18 సంవత‍్సరాల యువతిపై గుర్తు తెలియని దుండగులు లైంగికదాడి చేసి, ఆపై ఆమెను హతమార్చి గోనె సంచిలో కుక్కి బావిలో పడేశారు. మంగళవారం ఉదయం గోనెసంచి సహా యువతి మృతదేహం బావిలో తెలియాడుతుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువతిపై లైంగిక దాడిచేసి హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. యువతి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటన స‍్థలాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు.
Advertisement
Advertisement