ప్రియుడు వివాహానికి అంగీకరించలేదని ఓ యువతి కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించింది.
ప్రియుడితో వివాహం జరిపించాలని...
Nov 12 2016 4:16 PM | Updated on Sep 4 2017 7:55 PM
కొమరోలు: ప్రియుడు వివాహానికి అంగీకరించలేదని ఓ యువతి కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్.పద్మావతి(22) పదో తరగతి వరకు చదువుకుంది. గ్రామానికి చెందిన కొమ్మాలపాటి రామయ్య(25)తో పద్మావతికి ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకుంటానని చెప్పిన రామయ్య ఇటీవల మాటమార్చాడు. దీంతో యువతి తరపు వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వ్యవహారం పరిష్కారం కాకపోవటంతో సీపీఎం, మహిళా సంఘాల వారితో కలిసి జాతీయరహదారిపై బైఠాయించింది. గంటపాటు జరిగిన ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకించారు. బాధితులను స్టేషన్‌కు తీసుకెళ్లి, ఇరువర్గాల వారితో మాట్లాడుతున్నారు.
Advertisement


