సారంగాపూర్‌లో మహిళ హత్య | women murdered in jagitail district | Sakshi
Sakshi News home page

సారంగాపూర్‌లో మహిళ హత్య

Nov 29 2016 10:50 AM | Updated on Sep 4 2017 9:27 PM

జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో పూర్ణ (35) అనే మహిళ సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది.

జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో పూర్ణ (35) అనే మహిళ సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. ఈమె భర్త చనిపోగా ఒక కుమార్తె ఉంది. పూర్ణకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో సదరు వ్యక్తి కుమారుడు, ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను తలపై రోకలిబండతో మోది హత్య చేశాడు. కేకలు వినిపించడంతో స్థానికులు వచ్చేసరికి ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా పారిపోతూ ముగ్గురు నిందితులు బావిలో పడిపోయారు. దీంతో వారిలో ఒకరిని స్థానికలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement