యువతి మృతదేహం కలకలం | women deadbody found in gajwel | Sakshi
Sakshi News home page

యువతి మృతదేహం కలకలం

Dec 24 2016 12:49 PM | Updated on Sep 4 2017 11:31 PM

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో యువతి మృతదేహం కలకలం సృష్టించింది.

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో యువతి మృతదేహం కలకలం సృష్టించింది. అక్కారం-దాతర్‌పల్లి రోడ్డులో ముళ్లపొదల్లో అనుమానాస్పదంగా ఉన్న గోనెసంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గోనెసంచిని విప్పి చూడగా సుమారు 30 ఏళ్ల మహిళ మృతదేహం తల లేకుండా ఉంది. డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించి, ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ గిరిధర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement