భర్త ఎదుటే అత్యాచారం | Woman gang-raped in front of husband, three arrested | Sakshi
Sakshi News home page

భర్త ఎదుటే అత్యాచారం

Nov 26 2016 12:06 PM | Updated on Sep 4 2017 9:12 PM

భర్త ఎదుటే అత్యాచారం

భర్త ఎదుటే అత్యాచారం

కూలి పనులు ముగించుకుని భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బెంగళూరు: కూలి పనులు ముగించుకుని భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బన్నేరు ఘట్ట సమీపంలోని హుల్లహల్లిలో నివాసముంటున్న దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెల 23 వ తేదీన సాయంత్రం వీరిద్దరూ కూలి పనులు ముగించుకుని హుల్లహల్లి తోపు గుండా ఇంటికి బయల్దేరారు.
 
పెయింట్ పని చేసేందుకు వచ్చి కోళిపామ్ లేఔట్ లో నివాసముంటున్న తమిళనాడుకు చెందిన వినోద్, మణి, రాజులు వారిని గమనించి వెంటబడ్డారు. దంపతులను అడ్డగించి కత్తితో బెదిరించారు. అనంతరం భర్త ఎదుటే వివాహితపై సాముహిక అత్యాచారానికి పాల్పడి పరారయ్యారు. జరిగిన ఉదంతంపై బాధితురాలు బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement