విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత | Winter intensity increases more in Vizag agency areas | Sakshi
Sakshi News home page

విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత

Oct 23 2016 7:39 AM | Updated on Sep 4 2017 6:06 PM

విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత

విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత

విశాఖ మన్యంలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది.

విశాఖ: విశాఖ మన్యంలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పది గంటల వరకూ చలిగాలులు వీస్తున్నాయి. మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పివేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు కప్పేస్తోంది.

బాగా ఎండ వచ్చేవరకూ రహదారులు కూడా కనిపించట లేదు. పాడేరు, మినములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పోతురాజుగుడి సమీపంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదుకొండమ్మ పాదాల వద్ద 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement