బిహార్‌లో వరంగల్ ఖైదీ పట్టివేత | warangal escaped prisor arrested in bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో వరంగల్ ఖైదీ పట్టివేత

Dec 6 2016 11:15 AM | Updated on Jul 11 2019 7:49 PM

వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన ఖైదీ బిహార్‌లో పట్టుబడ్డాడు.

హైదరాబాద్: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన ఖైదీ బిహార్‌లో పట్టుబడ్డాడు. బిహార్‌లోని జహానాబాద్ జిల్లాకు చెందిన రాజేష్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని మూడు నెలల క్రితం చర్లపల్లి జైలు నుంచి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే, నవంబర్ 11వ తేదీన రాజేష్‌యాదవ్, సాయింక్ సింగ్ అనే మరో ఖైదీతో కలిసి బెడ్‌షీట్స్‌ను తాడుగా చేసుకుని జైలు గోడదూకి పారిపోయారు. అప్పటి నుంచి రాజేష్ పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బిహార్‌లో ఉన్న అతడ్ని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement