వీఐటీ విద్యార్థుల ప్రతిభ | vit Student Talent | Sakshi
Sakshi News home page

వీఐటీ విద్యార్థుల ప్రతిభ

May 10 2014 3:24 AM | Updated on Sep 2 2017 7:08 AM

వీఐటీ విద్యార్థుల ప్రతిభ

వీఐటీ విద్యార్థుల ప్రతిభ

పెద్ద పెద్ద మిద్దెలు, భవనాల మెట్లు ఎక్కే రోబోను దేశంలోనే మొట్టమొదటి సారిగా వీఐటీ విద్యార్థులు అయూష్‌కుమార్, పల్లవిపంబ్రే తయారు చేశారు.

వేలూరు, న్యూస్‌లైన్: పెద్ద పెద్ద మిద్దెలు, భవనాల మెట్లు ఎక్కే రోబోను దేశంలోనే మొట్టమొదటి సారిగా వీఐటీ విద్యార్థులు అయూష్‌కుమార్, పల్లవిపంబ్రే  తయారు చేశారు.  పెద్ద భవనాల్లోని  కార్యాలయాలకు తపాల సర్వీసులు, ప్రతిరోజూ తీసుకెళ్లేందుకు సమయం వృథా కావడమే కాకుండా పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.

 దీంతో వీఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆయూష్ కుమార్, పల్లవి పంబ్రే, ప్రొఫెసర్లు పార్థా ఎస్ మాలిక్, మత్యూ మిత్రాల సహకారంతో విద్యార్థులు ఈ రోబోను తయారు చేశారు. ఈ రోబో 15 సెంటీమీటర్ల ఎత్తుగల మెట్లను ఎక్కడం, దిగడం వంటివి చేస్తుందని వీటికి 1.5 కిలోల బరువు గల వస్తువును ఇది తీసుకొని రాగలదని విద్యార్థులు తెలిపారు. రోబోను తయారు చేసిన విద్యార్థులను చాన్స్‌లర్ విశ్వనాథన్, వైస్ చాన్స్‌లర్ రాజు, ఉపాధ్యక్షులు జీవీ సెల్వం, శంకర్ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement