నడిగర్ ఫలితాలలో విశాల్ వర్గానిదే హవా | vishal team succeded in nadigar sangam election results | Sakshi
Sakshi News home page

నడిగర్ ఫలితాలలో విశాల్ వర్గానిదే హవా

Oct 19 2015 8:38 AM | Updated on Aug 14 2018 4:32 PM

నడిగర్ ఫలితాలలో విశాల్ వర్గానిదే హవా - Sakshi

నడిగర్ ఫలితాలలో విశాల్ వర్గానిదే హవా

దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల ఫలితాలలో విశాల్ వర్గం హవా కొనసాగింది. నాజర్ 113 ఓట్ల తేడాతో శరత్ కుమార్పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల ఫలితాలలో విశాల్ వర్గం హవా కొనసాగింది. నాజర్ 113 ఓట్ల తేడాతో శరత్ కుమార్పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నాజర్కు 1344 ఓట్లు పోలవ్వగా, శరత్ కుమార్కు 1231 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీ ఘన విజయం సాధించారు. విశాల్కు 1445 ఓట్లు రాగా, రాధా రవికి 1138 ఓట్లు పోలయ్యాయి.

మరోసారి పగ్గాలు చేపట్టాలని భావించిన శరత్కుమార్ టీమ్ ఈ ఎన్నికల ఫలితాలలో డీలా పడింది. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతున్న విషయం అందరికి విదితమే. ఈ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి పద్మనాభన్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement