ఆయుధపూజకు 10 ఎండ్రదుక్కుళ్ | Vikram-Samantha's '10 Endrathukulla' | Sakshi
Sakshi News home page

ఆయుధపూజకు 10 ఎండ్రదుక్కుళ్

Oct 14 2015 3:07 AM | Updated on Sep 3 2017 10:54 AM

ఆయుధపూజకు 10 ఎండ్రదుక్కుళ్

ఆయుధపూజకు 10 ఎండ్రదుక్కుళ్

10 ఎండ్రదుక్కుళ్ చిత్రం విడుదల తేదీ ఖరారయ్యింది. విక్రమ్,సమంత జంటగా నటించిన చిత్రం 10 ఎండ్రదుక్కుళ్.

10 ఎండ్రదుక్కుళ్ చిత్రం విడుదల తేదీ ఖరారయ్యింది. విక్రమ్,సమంత జంటగా నటించిన చిత్రం 10 ఎండ్రదుక్కుళ్. ఇంతకు ముందు ఎంగేయుమ్ ఎప్పోదుమ్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఏఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. గోలీసోడా వంటి సంచలన విజయం సాధించిన చిత్ర సృష్టికర్త విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు.
 
 చిత్ర టీజర్, పాటల ఇప్పటికే విడదలయ్యి మంచి స్పందన రాబట్టుకున్నాయని చిత్ర వర్గాలు తెలిపారు. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయని అన్నారు. ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు సమంత కూడా ఎంతో రిస్క్ తీసుకుని యాక్షన్ సన్నివేశాలల్లో నటించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 10 ఎండ్రదుక్కుళ్ చిత్రానికి యు సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. చిత్రాన్ని ఆయుధపూజ(దసరా) సందర్భంగా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. కాగా తెలుగు,ిహ ందీ భాషల్లో వచ్చే నెల విడుదల చేయనున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement