వీసీల నియామకం కేసు సోమవారానికి వాయిదా | VC appointment case postponed to Monday | Sakshi
Sakshi News home page

వీసీల నియామకం కేసు సోమవారానికి వాయిదా

Aug 26 2016 6:40 PM | Updated on Sep 2 2018 5:24 PM

వీసీల నియామకం కేసు సోమవారానికి వాయిదా - Sakshi

వీసీల నియామకం కేసు సోమవారానికి వాయిదా

తెలంగాణలో యూనివర్శిటీ వీసీల నియామకం కేసు విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదావేసింది.

 తెలంగాణలో యూనివర్శిటీ వీసీల నియామకం కేసు విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదావేసింది. వీసీల నియామకపు ఉత్తర్వులను కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గత సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం యథాతథస్థితిని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసి విచారణను వాయిదావేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా తెలంగాణ ప్రభుత్వం కొంత సమయం కోరింది. ఈ నేపథ్యంలో విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారానికి వాయిదావేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement