మెదక్ జిల్లాలో సిండికేట్ బ్యాంకు ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ధర్నాకు దిగాడు.
బ్యాంకు ఎదుట వీహెచ్ మౌన దీక్ష
Dec 15 2016 1:12 PM | Updated on Sep 19 2019 8:28 PM
నంగనూరు : మెదక్ జిల్లా నంగనూరు మండలం పాలమాకుల సిండికేట్ బ్యాంకు ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ధర్నాకు దిగాడు. ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చాలని కోరుతూ నోటికి నల్లరిబ్బన్‌లు కట్టుకుని మౌనదీక్షకు దిగారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని విమర్శించాడు.
మా నాయకుడు రాహుల్‌గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అలా చేస్తున్నాడని ఆరోపించారు. మొదట నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్లిన తర్వాత ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గ్రామాలకు వస్తేగానీ తెలియదన్నారు.
Advertisement
Advertisement