ఆమెపై ఆరోపణలు నిరాధారం: మోత్కుపల్లి | Uma madhava reddy backed by motkupalli | Sakshi
Sakshi News home page

ఆమెపై ఆరోపణలు నిరాధారం: మోత్కుపల్లి

Aug 11 2016 7:37 PM | Updated on Aug 10 2018 8:16 PM

ఆమెపై ఆరోపణలు నిరాధారం: మోత్కుపల్లి - Sakshi

ఆమెపై ఆరోపణలు నిరాధారం: మోత్కుపల్లి

మాజీ మంత్రి ఉమామాధవరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

నయీం ఎన్‌కౌంటర్ అనంతరం మాజీ మంత్రి ఉమామాధవరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆరోపణలు కేవలం ప్రభుత్వ పరమైన లీకులేనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహిళపై ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement