బైపాస్ రోడ్డుపై.. రూ. 1600 కోట్ల డబ్బు | two lorries with 1600 crore money stuck at karur, aravakurichi bypass road | Sakshi
Sakshi News home page

బైపాస్ రోడ్డుపై.. రూ. 1600 కోట్ల డబ్బు

Jul 20 2016 3:49 PM | Updated on Aug 25 2018 6:13 PM

బైపాస్ రోడ్డుపై.. రూ. 1600 కోట్ల డబ్బు - Sakshi

బైపాస్ రోడ్డుపై.. రూ. 1600 కోట్ల డబ్బు

కోటి, రెండు కోట్లు రూపాయలు కాదు.. అక్షరాల 16 వందల కోట్ల రూపాయల డబ్బు!

కోటి, రెండు కోట్లు రూపాయలు కాదు.. అక్షరాల 16 వందల కోట్ల రూపాయల డబ్బు! ఈ నోట్ల కట్టలన్ని ఒక్కచోట పేర్చితే ఎంత బరువు, ఎంత పెద్ద సైజులో ఉంటుందో కదా..! ఈ డబ్బును తరలించాలంటే కంటెయినర్లు కావాలి.

కర్ణాటకలోని మైసూర్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి 16 వందల కోట్ల రూపాయల నగదును తరలించడానికి ఏర్పాట్లు చేశారు. రెండు కంటెయినర్లలో ఈ డబ్బును భారీ భద్రత మధ్య తరలిస్తున్నారు. తమిళనాడులో కరూర్-అరువంకుర్చి బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఓ లారీ ఇంజిన్లో సమస్య రావడంతో ఈ కంటెయినర్లు రోడ్డుపై ఆగిపోయాయి. భద్రతగా వస్తున్న సాయుధ పోలీసులు కంటెయినర్ల వద్ద రక్షణగా నిలిచారు.  పూర్తి వివరాలు తెలియవు కానీ ఇది బ్యాంకులకు సంబంధించిన డబ్బుగా భావిస్తున్నారు. డబ్బును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement