ఇద్దరు రైతుల మృతి | two farmers died in telangana | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల మృతి

Aug 26 2016 3:45 PM | Updated on Jun 4 2019 5:16 PM

కరీంనగర్ జిల్లా కోహెడ మండలం జ్యోతిరాం తండాకు చెందిన బానోతు లక్ష్మణ్(49) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కోహెడ: కరీంనగర్ జిల్లా కోహెడ మండలం జ్యోతిరాం తండాకు చెందిన బానోతు లక్ష్మణ్(49) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొక్కజొన్న చేను ఎండిపోవడంతో మనస్తాపం చెంది పంట చేను వద్దే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
కరెంటు షాక్‌తో మరో రైతు
మందమర్రి : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో కరెంటు షాక్ తో ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి ఇందిన శనికాల రాజయ్య(38) అనే రైతు శుక్రవారం పొలంలో యూరియా చల్లటానికి వెళ్లాడు. యూరియా సంచిని నెత్తిమీద పెట్టుకుని వెళ్తుండగా కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంటు తీగలు కిందకు వేలాడి ఉండటం గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రాజయ్య మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement