నెట్‌లో త్రిష పెళ్లి ఫొటో | Trisha wedding photo in net | Sakshi
Sakshi News home page

నెట్‌లో త్రిష పెళ్లి ఫొటో

Apr 17 2015 2:10 AM | Updated on Aug 25 2018 6:37 PM

నెట్‌లో త్రిష పెళ్లి ఫొటో - Sakshi

నెట్‌లో త్రిష పెళ్లి ఫొటో

ట్విట్టర్ అకౌంట్స్‌లతో తుంటరి అభిమానులే కాదు త్రిషలాంటి నటీమణులు ప్రేక్షకులతో ఆడుకుంటుంటారు.

ట్విట్టర్ అకౌంట్స్‌లతో తుంటరి అభిమానులే కాదు త్రిషలాంటి నటీమణులు ప్రేక్షకులతో ఆడుకుంటుంటారు. ఈ మధ్య  పెళ్లి ఫొటోను ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేసిన నటి చార్మి అందరికీ షాక్ ఇచ్చారు. చివరికి ఆ ఫొటో తాను నటిస్తున్న టాలీవుడ్ చిత్రం జ్యోతిలక్ష్మి లోనిదని తెలిసింది. త్రిష కూడా అభిమాను లకు ఇటీవల షాక్ ఇచ్చారు. త్రిష ఈ మధ్యనే నిర్మాత, వ్యాపారవేత్త అరుణ్‌మనియన్‌తో ప్రేమ వివాహానికి సిద్ధం అయ్యారు.
 
  వీరి నిశ్చితార్థం కూడా నిరాడంబరంగా జరిగిపోయింది. ఇక పెళ్లి పీటలెక్కడమే తరువాయి. కాగా అదెప్పుడనే ప్రశ్న పరిశ్రమలో చర్చనీయాంశమైంది. కారణం గత మార్చి నెలలోనే త్రిష వివాహం జరుగుతుందనే ప్రచారం జరిగింది. అయితే త్రిష తాను అంగీకరించిన చిత్రాలు పూర్తి చేసే వరకు వివాహాన్ని వాయిదా వేయాలని నిర్మాతల విజ్ఞప్తి మేరకు త్రిష వివాహ తేదీని నిర్ణయించలేదని సమాచారం. నిశ్చితార్థానికి ముందు ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేస్తూనే కొత్త చిత్రాలకు వరుసగా అంగీకరిస్తుండడం చాలామందిని ఆలోచనల్లో పడేస్తోంది.
 
 ఇలాంటి పరిస్థితిలో త్రిష పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫోటోను నెట్‌లో పోస్ట్ చేశారు. దీంతో త్రిష వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లి ఫోటోనే ఆమె నెట్‌లో పోస్ట్ చేశారు అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఆ ఫొటో త్రిష తాజా చిత్రం లోనిదన్న విషయం ఆ తరువాత తెలియవచ్చింది. అయితే ఇప్పుడా ఫొటోను నెట్‌లో ప్రచారం చేయడంలో త్రిష మతలబు ఏమిటబ్బా అని ఆరాలు తీసే పనిలో పడింది కోలీవుడ్.
 

Advertisement
 
Advertisement
Advertisement