బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్ ..తనదైన మ్యానరిజంతో బుల్లితెరపై స్టార్‌గా ఎదిగాడు.కేవలం కమెడియన్‌గానే కాకుండా యాంకర్‌గా, హోస్ట్‌గానూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బుల్లితెరపై వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారాడు. సినిమాల్లోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అయితే, సుధీర్ ఏ షో చేసిన ఆయన పెళ్లి, ప్రేమ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. జబర్దస్త్ షో చేసినప్పుడు..యాంకర్ రష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు స్కిట్లు చేయడం..పంచులు వేయడంతో నిజంగానే సుధీర్, రష్మి రిలేషన్లో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇదంతా షో టీఆర్పీ పెంచడం కోసం చేసిన స్టంట్స్ మాత్రమే. వినోదం పంచడం కోసమే అలా నటించామని అటు సుధీర్, ఇటు రష్మి చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తునే ఉన్నాయి.
(చదవండి: ‘ఇట్స్ థ్రిల్లింగ్ టైమ్’ అంటున్న బాలీవుడ్ స్టార్స్!)
తాజాగా సుధీర్‌కి 2014లోనే పెళ్లి అయిందనే వార్తలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అసలు విషయం ఏంటే.. సుధీర్‌కి 2014లో ఓ అమ్మాయితో నిజంగానే పెళ్లి ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంబంధం పెళ్లి పీటల దాకా వెళ్లకుండానే మధ్యలోనే రద్దయిపోయింది.
ఇద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లిని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు ఎంగేజ్మెంట్కి సంబంధించినవి. జబర్దస్త్ నటుడు రాకేజ్... నిశ్చితార్థం వేడుకకి వెళ్లి..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోలను బయటకు తీసి..నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక సుధీర్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన గోట్ రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. హైలెస్సో సెట్స్ మీద ఉంది.


