బాబాసాహెబ్‌కు ఘననివాళి | Tributes to Ambedkar | Sakshi
Sakshi News home page

బాబాసాహెబ్‌కు ఘననివాళి

Dec 7 2013 3:01 AM | Updated on Sep 2 2017 1:20 AM

బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని ఆయిల్‌మిల్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పురచ్చిభారతం పార్టీ నేతలు మహ, శ్రీధర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది ర్యాలీగా వచ్చి అంబేద్కర్‌కు ఘన నివాళి అర్పించారు.

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్ :
 బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని ఆయిల్‌మిల్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పురచ్చిభారతం పార్టీ నేతలు మహ, శ్రీధర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది ర్యాలీగా వచ్చి అంబేద్కర్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు మహ మాట్లాడుతూ నేటి యువత రాజ్యాం గం ద్వారా అంబేద్కర్ కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని ముందకు సాగాలన్నారు.
 
 అనంతరం వీసీకే పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మీరా థియేటర్ వద్ద నుంచి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పార్టీ జిల్లా కన్వీనర్ తలబది సుందరం అధ్యక్షత వహించగా, జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. అదే విధంగా బస్టాండు వద్ద వున్న అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి, యువజన నేత రజని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇదే విదంగా అంబేద్కర్ ఎంప్లాయిస్ యూనియన్ విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర ఉపకార్యదర్శి ద్రావిడ సెల్వం ఆధ్వర్యంలోని ఉద్యోగులు అంబేద్కర్‌కు నివాళి అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement