బీచ్‌లో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి | three youth died in nellore mypadu beach | Sakshi
Sakshi News home page

బీచ్‌లో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి

Nov 13 2016 4:54 PM | Updated on Oct 20 2018 6:07 PM

మైపాడు బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ఆదివారం మృత్యువాతపడ్డారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇందుకూరుపేటలోని మైపాడు బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ఆదివారం మృత్యువాతపడ్డారు.

నెల్లూరు నగరం రంగనాయకులుపేటకు చెందిన ఆరుగురు యువకులు సరదాగా ఈతకొడదామని మైపాడు బీచ్కు వెళ్లారు. స్నానానికి సముద్రంలోకి దిగిన వారిలో హరీష్(23), నదీమ్(23), ముదసిర్ఫ్(25) అనే ముగ్గురు మృతిచెందారు. స్థానికులు అప్రమత్తం కావడంతో మరో ముగ్గురిని రక్షించారు. వీరంతా నెల్లూరు నగరంలోని రంగనాయకులుపేటకు చెందిన వారిగా గుర్తించారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement