బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు దనిష్ అబ్డి, వృశాలీ ప్రసాదే స్విమ్మంగ్‌లో అరుదైన సాహసం చేసి చరిత్ర సృష్టించారు. వీరు శ్రీలంక నుంచి భారత్ వరకు సముద్ర మార్గంలో ఈదుతూ సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న రామసేతు మార్గం గండా ఈ ఫీట్ సాధించడం విశేషం.
దనిష్-వృశాలీ జంట శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ప్రయాణం ప్రారంభించి, తమిళనాడులోని ధనుష్‌కోడి వద్ద ముగించారు. ఇండియన్ ఓషియన్‌లో అలలు, బలమైన ప్రవాహాలను ఎదుర్కొంటూ వారు 10 గంటల 45 నిమిషాల్లో ఈ సాహస యాత్రను పూర్తి చేశారు.
బెంగళూరు నివాసులైన డానిష్ అబ్ది మరియు వృషాలి ప్రసాద్, శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్‌కోడి వరకు సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదారు.#SriLanka #Dhanushkodi #UANow pic.twitter.com/NylspcpXNi
— UttarandhraNow (@UttarandhraNow) May 8, 2026
ఈ ప్రయాణంలో కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది, ఎస్కార్ట్ బోట్లు వారికి సహకరించాయి. సముద్రంలో కఠిన పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ ధైర్యంగా ముందుకు సాగారు. ఈ ఫీట్‌ను సాధించికా దనిష్-వృశాలీ జంట సోషల్‌మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. శ్రీలంక నుంచి భారత్ వరకు విజయవంతంగా ఈదాం. ఇది చాలా కఠినమైన ప్రయాణం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్‌గా మారగా, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దనిష్-వృశాలీ దంపతులు గతంలో కూడా సముద్ర ఈత పోటీల్లో పాల్గొన్నారు. అయితే కలిసి చేసిన తొలి భారీ ఓపెన్ వాటర్ స్విమ్ ఇది. భారత్, శ్రీలంకల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసే ప్రయత్నంగా కూడా ఈ సాహసాన్ని వారు చేపట్టినట్లు తెలుస్తోంది.


