ఢిల్లీలో షహదర ప్రాంతంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షహదర ప్రాంతంలో మోహన్ పార్క్ వద్ద బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు. వాహనాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి.
ఓ భవంతిలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన భవంతిలో నివసిస్తున్నవారిని కాపాడినట్టు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సివుంది.