పాత ఇళ్లు కూలి ముగ్గురి మృతి | The old house collapse killed three | Sakshi
Sakshi News home page

పాత ఇళ్లు కూలి ముగ్గురి మృతి

Sep 23 2016 11:02 AM | Updated on Sep 4 2017 2:40 PM

ఆగకుండా కురుస్తున్న వర్షానికి పలు పాత భవనాలు, ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి.

- ముగ్గురికి గాయాలు
మెదక్

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి పలు పాత భవనాలు, ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేరు వేరు ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాకేంద్రంలోని కొలిగడ్డవీధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో కళావతి(35), తులసి(7) అనే ఇద్దరు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


సదాశివపేట మండలంలోని ముబారక్‌పూర్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న నడ్డిమెట్టి శ్యామమ్మ(65) అనే వృద్ధురాలు మృతిచెందింది. శ్యామమ్మ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో వైపు.. జిల్లాలోని  జిన్నారం మండలం కనుకుంట గ్రామంలో  ఇల్లు కూలి ఇద్దరు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement