అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం | telugu techie dies in usa after pinning under car | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం

Oct 13 2016 12:17 PM | Updated on Jul 6 2019 12:42 PM

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం - Sakshi

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం

కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో దుర్మరణం చెందారు.

కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో దుర్మరణం చెందారు. ముదినేపల్లికి చెందిన వల్లభనేని హరీష్ (42) అమెరికాలోని పిట్స్‌బర్గ్ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. బయటకు వెళ్లేందుకు కారు స్టార్ట్ చేయబోతే అది స్టార్ట్ కాలేదని, దాంతో ముందుకు వెళ్లి బోనెట్ ఎత్తి చూస్తుండగా.. ముందు అంతా బాగా డౌన్ ఉండటంతో కారు ఒక్కసారిగా ముందుకు దూకిందని.. దాంతో కారు అతడి ఛాతీ మీదుగా వెళ్లి చనిపోయాడని సమాచారం అందింది.

హరీష్ తల్లిదండ్రులకు అతడి మృతి గురించిన సమాచారం బుధవారం సాయంత్రం దాటిన తర్వాత తెలిసింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుర్ఘటన జరగడానికి గంట ముందు కూడా స్వదేశంలోని కుటుంబ సభ్యులతో మాట్లాడాడని అంటున్నారు. ముదినేపల్లిలోని హరీష్ ఇంటివద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement