పన్ను ఎగవేసినందుకు జరిమానా | Tax evasion fine | Sakshi
Sakshi News home page

పన్ను ఎగవేసినందుకు జరిమానా

Feb 23 2015 1:34 AM | Updated on Oct 2 2018 4:31 PM

ఆదాయ పన్ను కట్టకుండా మోసం చేసిన కేసులో ఒక ప్రయివేటు సంస్థకు రూ. 8 లక్షలమేర జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది.

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను కట్టకుండా మోసం చేసిన కేసులో ఒక ప్రయివేటు సంస్థకు రూ. 8 లక్షలమేర జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. గడువులోగా ఆదాయ పన్ను విభాగానికి జరిమానా చెల్లించాలని పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ శర్మ ఆదేశించారు. కాగా, ఈ కంపెనీకి మొదటిసారి 2008-09 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలు జరిమానా విధించగా అది చెల్లించలేదు. దీంతో 2009-10, 2010-11 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 లక్షల చొప్పున జరిమానా విధించింది. అంతేకాకుండా ఆదాయ పన్ను శాఖ వివరాల ప్రకారం ఈ సంస్థ 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో వరుసగా రూ. 29.1లక్షలు, రూ. 24.8లక్షలు, రూ.24.6 లక్షల మేర తమ ఉద్యోగులకు జీతాలు తగ్గించిందని తెలిపింది.

ఇచ్చిన సమయంలోగా టీడీఎస్ కింద చెల్లించాల్సిన డబ్బు విషయంలో నిర్లక్ష్యం వహించిందని, ఆ డబ్బును ఇతర ప్రయోజనాలకు వాడుకుందని చెప్పింది. అయితే ఆర్థిక సంక్షోభం వల్ల ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే డబ్బు సరిపోలేదని, అందువల్ల ఆదాయ పన్ను కూడా కట్టలేకపోయామని ఆ సంస్థ తెలిపింది. ఇలాంటి పన్ను ఎగవేతదారులవల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని, అది పేదలకు శాపంగా పరిణమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కంపెనీలు, వ్యక్తులు పన్ను చెల్లించకపోవడం నానాటికీ పెరిగిపోతుండటంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement