అండర్‌ స్టాండింగ్ ఉంది | Tamilukku En Ondrai Aluthavum | Sakshi
Sakshi News home page

అండర్‌ స్టాండింగ్ ఉంది

Nov 24 2014 2:05 AM | Updated on Sep 2 2017 4:59 PM

అండర్‌ స్టాండింగ్ ఉంది

అండర్‌ స్టాండింగ్ ఉంది

అట్టకత్తి ఫేమ్ దినేష్‌కు తనకు మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండటంతో చిత్ర అవుట్‌పుట్ బాగా వచ్చిందని నటి బిందుమాధవి తెలిపారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న

 అట్టకత్తి ఫేమ్ దినేష్‌కు తనకు మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండటంతో చిత్ర అవుట్‌పుట్ బాగా వచ్చిందని నటి బిందుమాధవి తెలిపారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం తమిళుక్కు ఎన్ 1 ఐ అళుత్తువుం. మరో జంటగా నకుల్, ఐశ్వర్యదత్ నటిస్తున్నారు. రామ్ ప్రకాష్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీఎల్‌కే రాక్ సినిమా పతాకంపై నిర్మాత వి.చంద్రన్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం వివరాలను తెలియచేయడానికి చిత్ర యూనిట్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిందుమాధవి మాట్లాడారు.  తానింతవరకు నటించిన చిత్రాల్లోనే వైవిధ్యభరిత పాత్రను ఈ చిత్రంలో పోషించానని చెప్పారు. చిత్ర హీరో దినేష్‌కు తనకు మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండడంతో తాము నటించిన సన్నివేశాలకు మంచి అవుట్‌ఫుట్ వచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు, ఛాయాగ్రాహకుడితోను తనకు మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని తెలిపింది. అనంతరం ఈ చిత్రానికి పని చేసిన సహాయ దర్శకులందరినీ వేదిక పైకి పిలిచి వీరి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. భాషరాని తనకు వీరి సహకారం లేనిదే పాత్రకు న్యాయం చేయడం సాధ్యం కాదని వారి శ్రమను బిందుమాధవి ప్రశంసించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement