శ్రీలంక వ్యాఖ్యలపై తమిళ చిత్ర పరిశ్రమ ధర్నా | Tamil Film industry dharna on Controversial article on Sri Lankan defence website | Sakshi
Sakshi News home page

శ్రీలంక వ్యాఖ్యలపై తమిళ చిత్ర పరిశ్రమ ధర్నా

Aug 4 2014 10:54 AM | Updated on Nov 9 2018 6:39 PM

శ్రీలంక రక్షణ శాఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళ చిత్ర పరిశ్రమ సోమవారం ధర్నాకు దిగింది.

చెన్నై: శ్రీలంక రక్షణ శాఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళ చిత్ర పరిశ్రమ సోమవారం ధర్నాకు దిగింది. చెన్నైలోని శ్రీలంక కాన్సులేట్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ చిత్ర పరిశ్రమ ఆందోళన చేపట్టింది. శ్రీలంక రక్షణ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా ఓ ఫోటోలతో పాటు.. కామెంట్స్ పొందుపరిచారు.

 

ఈ ఫోటోలు తమిళనాడులో సంచలనం సృష్టించగా, ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. తమిళ జాలర్ల అంశంపై ప్రధానికి రాసే లేఖలను నరేంద్ర మోడీకి జయలలిత రాస్తున్న ప్రేమ లేఖలు అనే అర్థం వచ్చేలా అందులో కామెంట్స్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం శ్రీలంక రక్షణ శాఖ క్షమాపణలు చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement