ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని జెరుసలెం మత్తయ్యను
ఓటుకు కోట్లు కేసులో మత్తయ్యకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని జెరుసలెం మత్తయ్యను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ కేసు విచారణ నుంచి మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.