రజనీ తర్వాత శింబు | Superstar Rajinikanth Next Little Superstar after Simbu | Sakshi
Sakshi News home page

రజనీ తర్వాత శింబు

Nov 25 2014 2:49 AM | Updated on Apr 3 2019 6:23 PM

రజనీ తర్వాత శింబు - Sakshi

రజనీ తర్వాత శింబు

సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత వస్తానంటున్నారు లిటిల్ సూపర్‌స్టార్ శింబు. ఏమి టి శింబు మాటల్లో అతిశయోక్తి కనిపిస్తోందా? విషయం ఏమిటంటే.

సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత వస్తానంటున్నారు లిటిల్ సూపర్‌స్టార్ శింబు. ఏమి టి శింబు మాటల్లో అతిశయోక్తి కనిపిస్తోందా? విషయం ఏమిటంటే. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం లింగలో సూపర్‌స్టార్ ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరో పాత్రలో అందాల రాశి అనుష్క రొమాన్స్ చేశారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించగా ఈరోస్ సంస్థ విడుదల చేయనుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీత భాణీలందించిన ఈ చిత్ర పాటలకు ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలై మంచి స్పందన వస్తోంది. చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భం గా డిసెంబర్ 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుం టోంది. ఈ విషయం అటుంచితే సంచలన జంట శింబు, హన్సిక నటించిన వాలు చిత్రం చాలాకాలంగా నిర్మాణంలో వుంది. నిక్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్నా రు. ఈ చిత్రం విడుదలకు ఇప్పుడు ముహూర్తం కుదిరిందంటున్నారు. ఒక్క పాట మినహా వాలు చిత్రం చిత్రీకరణ పూర్తి అయ్యిందని దర్శకుడు తెలిపారు. ఈ పాటను డిసెంబర్ ఏడో తేదీలోగా చిత్రీకరించడానికి సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు.

రైల్వే కాలనీ నేపథ్యంలో తెరకెక్కిన వాలు చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు దర్శకుడు వెల్లడించారు. శింబు, హన్సిక ప్రేమ సన్నివేశాలు సూపర్‌గా ఉంటాయని సంతానం చేసిన హాస్యం కడుపుబ్బ నవ్విస్తుందని అంటున్నారు. చిత్రాన్ని మ్యాజిక్‌రేస్ సంస్థ డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని దర్శకులు తెలిపారు. అంటే రజనీకాంత్ చిత్రం లింగ విడుదలైన సరిగ్గా 12 రోజులకు వాలు తెరపైకి రానుందన్న మాట.   

 

Advertisement
 
Advertisement
Advertisement