హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య | student suicide in hostel room in tirupati | Sakshi
Sakshi News home page

హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

Oct 1 2016 9:54 AM | Updated on Sep 17 2018 7:38 PM

నగరంలోని ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ హస్టల్ గదిలో విద్యార్థిని శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తిరుపతి: నగరంలోని ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ హస్టల్ గదిలో విద్యార్థిని శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఉదయం ఆ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు కాలేజీ సిబ్బందికి తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని పేరు స్వాతి అని పోలీసులు తెలిపారు. ఆమెది కడప జిల్లా స్వస్థలం అని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కుమార్తె మృతికి హాస్టల్ వార్డెన్ వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement