శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలంలో సోమవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.
భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం
Apr 3 2017 11:51 AM | Updated on Sep 5 2017 7:51 AM
భద్రాచలం: శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం ఈనెల 5వ తేదీన జరగనున్న సందర్భంగా సోమవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మాడ వీధులు భక్తులతో సందడిగా మారాయి. సోమవారం స్వామివారు ముత్తంగి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా యాగశాలలో హోమం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠ్రాపన కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకులను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో రామాలయం కిటకిటలాడింది. కోవెలలో పుష్పాలంకరణతో పాటు మామిడి తోరణాలను అలంకరించడంతో ఆలయ వాతావరణం శోభాయమానంగా మారింది.
Advertisement
Advertisement