పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి | Siblings died of snake bite in Darbhanga | Sakshi
Sakshi News home page

పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి

Aug 28 2016 1:44 PM | Updated on Sep 28 2018 3:41 PM

పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి - Sakshi

పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి

ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను పాము కరవడంతో మృతి చెందారు.

దర్భాంగా: బిహార్లోని దర్భాంగా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టొలి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు పాముకాటుతో మృతి చెందారు. అన్నాచెల్లెలు.. ఆనంద్ పండిట్(12),  కిరణ్ కుమారి(10)లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శనివారం అర్థరాత్రి సమయంలో వారిని పాము కాటేసింది.
 
వీరిని తల్లిదండ్రలు వెంటనే దర్భాంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స అందిస్తుండగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దిల్నవాజ్ అహ్మద్ వెల్లడించారు. మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement