శ్రుతి పాత్రలో తమన్న | Shruti Haasan Replaced By Tamanna | Sakshi
Sakshi News home page

శ్రుతి పాత్రలో తమన్న

Mar 30 2015 2:08 AM | Updated on Jul 15 2019 9:21 PM

శ్రుతి పాత్రలో తమన్న - Sakshi

శ్రుతి పాత్రలో తమన్న

శ్రుతిహాసన్ వైదొలగిన చిత్రంలో నటి తమన్న ఎంపికైనట్టు కోలీవుడ్ టాక్. టాలీవుడ్ నటుడు నాగార్జున,

 శ్రుతిహాసన్ వైదొలగిన చిత్రంలో నటి తమన్న ఎంపికైనట్టు కోలీవుడ్ టాక్. టాలీవుడ్ నటుడు నాగార్జున, కోలీవుడ్ నటుడు కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సిని మా సంస్థ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా (కార్తీకి జంటగా) నటి శ్రుతిహాసన్‌ను ఎంపిక చేశారు. అయితే తీరా చిత్ర షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరుణంలో ఆమె చిత్రం చేయడం లేదని చెప్పడం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఆమెపై కోర్టులో కేసులు వేయడం వంటి పరిణామాలు పాఠకులకు తెలిసిందే. కొత్త చిత్రాలను అంగీకరించరాదని శ్రుతిపై కోర్టు ఆదేశించిన తరుణంలో ఆమెపై హైదరాబాద్ పోలీసులు కేసును నమోదు కూడా చేశారు.
 
 ఇలాంటి పరిస్థితిలో శ్రుతి వైదొలగిన చిత్రంలో ఆమెకు బదులుగా మిల్కీ బ్యూటీ తమన్న ఎంపికైనట్లు సమాచారం. కాగా కార్తీ తమన్నలది హిట్ పెయిర్. వీరిద్దరూ కలసి నటించిన పైయ్యా, చిరుదై చిత్రాలు విజయం సాధించాయి. అదే విధంగా తమన్నకు తమి ళం, తెలుగు భాషలలో మంచి పేరే ఉంది. తమిళంలో వీరం చిత్రం తరువాత ప్రస్తుతం ఆర్యతో కలసి ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో శ్రుతి హాసన్ పాత్రలో ఆమె బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు తమన్నను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారిక పూర్వకంగా వెల్లడించలేదన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement