ప్రచారంలో షీలా బిజీబిజీ | Sheila Dikshit busy Campaign in Delhi Assembly Elections | Sakshi
Sakshi News home page

ప్రచారంలో షీలా బిజీబిజీ

Nov 30 2013 11:29 PM | Updated on Mar 18 2019 9:02 PM

విధానసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఉదయం నుంచి రాత్రి

సాక్షి, న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నా రు. తన సొంత నియోజకవర్గం అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సౌత్‌ఎవెన్యూ, బీజే దత్‌కాలనీ ల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. స్థానికులను వ్యక్తిగతంగా కలుస్తూ మరోమారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. 15 ఏళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్టు షీలా దీక్షిత్ పేర్కొన్నారు. 
 
 ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వివరించారు. న్యూఢిల్లీ నియోజకవర్గాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో తీర్చిదిద్దినట్టు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేద లు వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా చేయూ త ఇవ్వడంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు. వారి కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవే శపెట్టామ న్నారు.ఓట్ల కోసం ప్రతిపక్ష బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ బూటకపు హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ చెప్పినట్టుగా విద్యుత్ టారిఫ్ ను 30 శాతం తగ్గించడం అసాధ్య మని స్పష్టం చేశారు. బీకే దత్ కాలనీలో షీలా దీక్షిత్ నిర్వహించిన రోడ్‌షోకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. జీపులో వెళుతూ స్థానికులకు అభివాదం చేస్తూ ముం దుకు సాగారు.
 
 కట్‌పుత్లీ కాలనీని అభివృద్ధి చేస్తాం: మంత్రి రమాకాంత్‌గోస్వామి
 కట్‌పుత్లీ కాలనీవాసులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి రమాకాంత్ గోస్వామి హామీ ఇచ్చారు. స్థానికంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పలువురు ఓటర్లతో మాట్లాడారు. స్థానికులు ఈ సందర్భంగా తమ ఇబ్బందుల ను మంత్రికి మొర పెట్టుకున్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తోందని, స్థాని కంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ కాల నీలోని 3,500కుంటుంబాలకు ప్రభుత్వం త్వరలోనే పునరావాసం కల్పిస్తుందన్నారు. దీనిలో ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని మంత్రి రమాకాంత్ గోస్వామి హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement